Home /Author anantharao b
ఇంజనీరింగ్ అంటే కంప్యూటర్ సైన్స్, ఈసీఈ లేనా? ఇటీవల బాగా ప్రాచుర్యంలోకి వచ్చిన మ్యాధ్స్ అండ్ కంప్యూటర్స్ ప్రత్యేకత ఏమిటి? దీనిపై ప్రముఖ విద్యానిపుణుడు డాక్టర్ సతీష్ విద్యార్దులకు ఉపయోగపడే సూచనలిచ్చారు.
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ భార్య ఉపాసన ఈ నెల 20న ఆడబిడ్డకు జన్మనిచ్చిన విషయం తెలిసిందే. మూడు రోజుల తరువాత శుక్రవారం తల్లి, బిడ్డ హైదరాబాద్ అపోలో ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అయ్యారు రామ్ చరణ్ వీరిని తన ఇంటికి తీసుకు వెళ్లారు.
రాజకీయ లబ్ది కోసం శ్రీవాణి ట్రస్ట్ పై ఆరోపణలు చేయడం ఏమాత్రం సరికాదని టీటీడీ ఛైర్మన్ వై.వి సుబ్బారెడ్డి అన్నారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ దళారీ వ్యవస్థను రూపుమాపడానికి శ్రీవాణి ట్రస్ట్ ను పునరుద్ధరించామన్నారు. 70 మంది దళారీలను అరెస్ట్ చేసి 214 కేసులు నమోదు చేశామన్నారు
తిరుమల నడకదారి 7వ మైలు వద్ద మూడేళ్ల బాలుడిపై చిరుత దాడి చేయడం కలకలం రేపింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం ఐదేళ్ల బాలుడు తన తాతతో కలిసి కుర్ కురే ప్యాకెట్ కొనుక్కుంటున్న సందర్బంగాఒక్కసారిగా లోపలికి దూసుకొచ్చిన చిరుత బాలుడి మెడ పట్టుకుని పారిపోయేందుకు ప్రయత్నించింది
జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్‌కు వ్యతిరేకంగా కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం మరో లేఖను విడుదల చేశారు. కాకినాడ సిటీ నుంచి ద్వారంపూడిపై కానీ.. ఒక వేళ అక్కడి నుంచి కాకపోతే.. పిఠాపురం నుంచి తనపై పోటీ చేయాలని సవాల్ విసిరారు.
హైదరాబాద్‌లో రెండు వేర్వేరు ఘటనల్లో పోలీసులు భారీగా మాదకద్రవ్యాలని స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలోని టోలీచౌకిలో ముంబైనుంచి డ్రగ్స్ తీసుకు వచ్చి అమ్ముతున్న ఇర్ఫాన్‌ని పోలీసులు పట్టుకున్నారు. మఫ్టీలో మాటువేసి పట్టుకున్న ఫిలింనగర్ పోలీసులు ఎనిమిది పాయింట్ అయిదు ఆరు గ్రాముల హెరాయిన్‌ని స్వాధీనం చేసుకున్నారు.
ఒక్క ఛాన్స్ అంటూ వేడుకుని అందరినీ నాశనం చేసారంటూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వైసీపీ అధినేతపై మండిపడ్డారు. వారాహి యాత్రలో భాగంగా అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో గురువారం సాయంత్రం బహిరంగ సభలో ఆయన మాట్లాడారు.
వేటకు వెళ్లి సముద్రంలో కొట్టుకుపోయిన ఓ మత్స్యకారుడు సుమారు 11 గంటల పాటు సముద్రంలో ఈత కొట్టి అటుగా వస్తున్న వేరే బోటు వారు రక్షించడంతో మృత్యుంజయుడుగా నిలిచాడు. దీనికి సంబంధించి వివరాలివి.
టిఎస్పిఎస్సి గ్రూప్ 1 ప్రిలిమ్స్ రద్దు చేయాలన్న పిటిషన్‌పై హైకోర్టులో విచారణ మూడు వారాలకి వాయిదా పడింది. అభ్యర్థుల బయోమెట్రిక్ సేకరించక పోవడంపై అనుమానాలున్నాయని పిటిషనర్లు కోర్టుకి మొరపెట్టుకున్నారు. ఓఎంఆర్ షీటుపై హాల్ టికెట్, ఫొటో లేకపోవడం అనుమానాస్పదంగా ఉందని పిటిషనర్లు వాదనలు వినిపించారు
దేవేంద్ర ఫడ్నవీస్.. మహారాష్ట్ర రాజకీయాల్లో చాలా పెద్ద పేరు. గతంలో సీఎంగా ఇపుడు డిప్యూటీ సీఎంగా ఉన్నారు. దేశంలోని పలు ప్రాంతాల ప్రజలకు కూడా ఈ పేరు సుపరిచితమే. అయితే ఫడ్నవీస్ మహారాష్ట్ర చంద్రాపూర్ జిల్లాలో డిప్యూటీ సీఎంగా కాకుండా కొన్ని 'విచిత్రమైన' కారణాల వల్ల బాగా ప్రాచుర్యం పొందుతున్నారు.