Last Updated:

White House Dinner: ప్రధాని మోదీకి వైట్‌ హౌస్‌ లో విందు ఇచ్చిన బైడెన్ దంపతులు

అమెరికా ప్రెసిడెంట్‌ జో బైడెన్‌ దంపతుల ఆహ్వానం మేరకు భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రస్తుతం అమెరికాలో పర్యటిస్తున్నారు. ఆయన అమెరికాలో బిజీ బిజీగా గడుపుతున్నారు. కాగా జోబైడెన్‌, ఆయన భార్య జిల్‌ బైడెన్‌ మోదీకి వైట్‌ హౌస్‌ విందు ఏర్పాటు చేశారు. ఈ విందుకు మొత్తం 400 మంది అతిథులను ఆహ్వానించారు.

White House Dinner: ప్రధాని మోదీకి వైట్‌ హౌస్‌ లో విందు ఇచ్చిన బైడెన్ దంపతులు

White House Dinner: అమెరికా ప్రెసిడెంట్‌ జో బైడెన్‌ దంపతుల ఆహ్వానం మేరకు భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రస్తుతం అమెరికాలో పర్యటిస్తున్నారు. ఆయన అమెరికాలో బిజీ బిజీగా గడుపుతున్నారు. కాగా జోబైడెన్‌, ఆయన భార్య జిల్‌ బైడెన్‌ మోదీకి వైట్‌ హౌస్‌ విందు ఏర్పాటు చేశారు. ఈ విందుకు మొత్తం 400 మంది అతిథులను ఆహ్వానించారు.ద్వైపాక్షిక చర్చలు, మీడియా సమావేశం తర్వాత యూఎస్‌ కాంగ్రెస్‌లో మోదీ ప్రసంగం తర్వాత ప్రధాని మోదీకి అమెరికా ప్రెసిడెంట్‌ స్టేట్‌ డిన్నర్‌ ఇచ్చారు. ఈ డిన్నర్‌లో ప్రధానమంత్రి అమెరికా ప్రెసిడెంట్‌లో పాటు అక్కడికి వచ్చిన అతిథులతో సరదాగా జోకులు వేస్తూ కనిపించారు.

మేమిద్దరం తాగడంలేదు..(White House Dinner)

డిన్నర్‌ ప్రారంభంలో బైడెన్‌ సరదాగా 400 మంది అతిథులను ఆహ్వానిస్తూ.. ప్రధానమంత్రి మోదీకి చెందిన వాషింగ్టన్‌లోని వైట్‌హౌస్‌కు మీకు స్వాగతం అన్నారు. గతంలో ఎంతో మందికి తాము స్టేట్‌ డిన్నర్‌ ఇచ్చాం.. అయితే మోదీకి ఇచ్చిన ఇలాంటి వెల్‌కం గతంలో ఇచ్చినట్లు గుర్తు లేదని బైడెన్‌ అన్నారు. అయితే ఇక్కడ ఆశ్చర్య కలిగించే అంశం ఏమిటంటే ఇరువురు ప్రధాని మోదీ కానీ, అటు బైడెన్‌ కానీ ఇద్దరు అల్కాహాల్‌ తాగరు. మా ఇద్దరికీ శుభవార్త ఏమిటంటే మేమిద్దరం తాగడం లేదుఅని ప్రెసిడెంట్ బైడెన్ చెప్పారు, ఇద్దరు నాయకులు టోస్ట్‌లో గ్లాసెస్ పైకి లేపారు.బైడెన్‌ తన తాత ఇచ్చిన సలహాను ఇక్కడ గుర్తు చేసుకున్నారు అల్కాహాల్‌ లేకుండా టోస్ట్‌ చేయాలని తన తాత సూచించారని అన్నారు. ఎవరితో నైనా టోస్ట్‌ అంటే గ్లాస్‌లు ఎత్తి టోస్ట్‌ చేసేటప్పుడు మీ గ్లాస్‌లలో అల్కహాలు ఉండరాదని, అదీ కూడా ఎడమ చేతితో టోస్ట్‌ చేయండని చెప్పేవారన్నారు. ఇవన్నీ తాను తమాషాకు చెబుతున్నానని అనుకుంటున్నారేమో కాదు వాస్తవం అని బైడెన్‌ అన్నారు.

ముఖేష్ అంబానీ.. సుందర్ పిచాయ్..

బైడెన్‌ స్టేట్‌ డిన్నర్‌ విషయానికి వస్తే గెస్ట్‌లలో ఇండియా తరపున ముఖేష్‌ అంబానీ, గూగుల్‌ సీఈవో సుందర్‌ పిచాయ్‌, ఆపిల్‌ సీఈవో టిమ్‌కుక్, ఆనంద్‌ మహీంద్రా, కార్పొరేట్‌ లీడర్‌ ఇంద్రానూయి. మైక్రోసాఫ్ట్‌ సీఈవో సత్యా నాదెళ్ల, ఆడోబ్‌ సీఈవో శాంతన నారాయన్‌లు హాజరయ్యారు. డిన్నర్‌ ప్రారంభానికి ముందు పిచాయ్‌ మాట్లాడుతూ… ఈ డిన్నర్‌ ద్వారా అమెరికా – ఇండియా సంబంధాలు మరింత బలపడతాయని ఆశిస్తున్నానని అన్నారు. రెండు దేశాలు ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్య దేశాలన్నారు. టెక్నాలజీ ఈ రెండు దేశాలను కలుపుతోందన్నారు. ఇరు దేశాల మధ్య సంబంధాలు బలపడితే భారత్‌కు పెద్ద ఎత్తున పెట్టబుడులు వచ్చే అవకాశం ఉందన్నారు. ఇక ఇండియా తరపున జాతీయ భద్రతా సలహాదారు అజిత్‌ దోవాల్‌, విదేశాంగమంత్రి ఎస్‌ జైశంకర్‌ ఈ స్టేట్‌ డిన్నర్‌కు హాజరయ్యారు. అమెరికా రాయబారులతో పాటు బైడెన్‌ ప్రభుత్వంలో ఉన్నతాధికారులు కూడా హాజరయ్యారు. ఇండియాలో అమెరికా రాయబారి ఎరిక్‌ గార్సెట్టి కూడా డిన్నర్‌కు హాజరయ్యారు. బైడన్‌ కుటుంబసభ్యులు.. వారి కుమారుడు హంటర్‌ కూడా హాజరయ్యారు. కాగా హంటర్‌ బైడెన్‌ విషయానికి వస్తే పన్ను ఎగ్గొట్టిన కేసులో నేరాన్ని అంగీకరించారు. కాగా తండ్రి బైడెన్‌ ప్రెసిడెంట్‌ అయిన తర్వాత నుంచి తరచూ వైట్‌హౌస్‌లో కనిపిస్తున్నారు. తాజాగా ఇలాంటి డిన్నర్‌ పార్టీలో పాల్గొంటున్నారు. గత ఏడాది ఫ్రెంచి ప్రెసిడెంట్‌ ఎమ్మాన్యుయెల్‌ మక్రాన్‌కు స్టేట్‌ డిన్నర్‌ ఇచ్చినప్పుడు కూడా హంటర్‌ హాజరయ్యారు.

బైడెన్‌ కుటుంబానికి చెందిన సభ్యుల విషయానికి వస్తే..హంటర్‌ భార్య మెలిసా కోహెన్‌ బైడెన్‌, ఆయన సోదరి ఆష్లే బైడెన్‌, కూతురు నావోమి బైడెన్‌ నీల్‌, ఆమె భర్త పీటర్‌ నీల్‌, ఆయన మామ జెమ్స్‌ బైడెన్‌లు హాజరయ్యారు. ఇతర అతిథుల విషయానికి వస్తే హుమా అబెడిన్‌, మానవ హక్కుల కార్యకర్త మార్టిన్‌ లూథర్‌ కింగ్‌ -3, టెన్నిస్‌ లెజెండ్‌ బిల్లే జీన్‌ కింగ్‌, ఫిల్మ్‌ మేకర్‌ ఎం నైట్‌ శ్యామలాన్‌, ఫ్యాషన్‌ డిజైనర్‌ రాల్ప్‌ లారెన్‌, గ్రామీ అవార్డు విన్నర్‌ జోషువా బెల్‌, ఎంటర్‌ ప్రెన్యూర్‌ ఫ్రాంక్‌ ఇస్లామ్‌లు హాజరయ్యారు. కాగా అద్భుతమైన డిన్నర్‌ ఇచ్చినందుకు మోదీ బైడెన్‌ దంపతులకు ధన్యవాదాలు తెలిపారు.

ఇక ఫుడ్‌ విషయానికి వస్తే ఈ డిన్నర్‌లో చాలా మటుకు శాఖాహారమే వండివర్చారు. ప్రధానమంత్రి మోదీ పక్కా శాఖాహారి కాబట్టి ఎక్కువగా శాఖాహారమే అతిథులకు సర్వ్‌ చేశారు. ఇక డ్రింక్స్‌విషయానికి వస్తే మోదీతో పాటు బైడెన్‌ ఇద్దరు ఆల్కాహాల్‌కు దూరం. అయితే గెస్ట్‌లకు పటేల్‌ రెడ్‌ బ్లెండ్‌ 2019 నెపా వ్యాలీ వైనరీ యజమాని రాజ్‌ పటేల్‌ సర్వ్‌ చేశారు. గుజరాత్‌ నుంచి అమెరికా వచ్చిన రాజ్‌పటేల్‌.. అమెరికాలో పటేల్‌ వైన్స్‌ యజమాని. ఇండియాలో మోదీ అద్బుతంగా పనిచేస్తున్నారని రాజ్‌పటేల్‌ మోదీపై ప్రశంసల వర్షం కురిపించారు. అతిథులకు దిల్‌సే చిత్రంలోని చయ్య చయ్య పాటతో ఎంటర్‌టెయిన్‌ చేశారు.