Home /Author anantharao b
భారతదేశంలో పిల్లలపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారనే ఆరోపణలపై లండన్‌కు చెందిన ఒక వ్యక్తిని యూకే అధికారులు అరెస్టు చేశారు. అతని నుండి పిల్లలపై లైంగిక వేధింపులకు సంబంధించిన వేలాది చిత్రాలు మరియు వీడియోలను స్వాధీనం చేసుకున్నారు.
భారత ప్రధాని మోదీ చారిత్రాత్మకమైన యునైటెడ్ స్టేట్స్ పర్యటన నేపధ్యంలో హెచ్-1బీ వీసాలు ఉన్న భారతీయులకు దేశంలో నివసించడం మరియు పని చేయడం సులభతరం చేయాలని బైడెన్ ప్రభుత్వం ప్రతిపాదించినట్లు రాయిటర్స్ తెలిపింది.
ప్రధాని నరేంద్ర మోదీ అమెరికా పర్యటన సందర్భంగా, భారత వైమానిక దళం కోసం ఫైటర్ జెట్ ఇంజిన్లను ఉత్పత్తి చేసేందుకు ప్రభుత్వ యాజమాన్యంలోని హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (హెచ్ఏఎల్)తో ఒప్పందం కుదుర్చుకున్నట్లు జీఈ ఏరోస్పేస్ ఈరోజు ప్రకటించింది.
పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి బుద్ధదేవ్ భట్టాచార్య కుమార్తె సుచేతన భట్టాచార్య లింగమార్పిడి శస్త్రచికిత్స (ఎస్ఆర్ఎస్) చేయించుకోనున్నట్లు ప్రకటించారు. ఇటీవల LGBTQ వర్క్‌షాప్‌కు హాజరైన సుచేతన, శస్త్రచికిత్సకు వెళ్లే ముందు అవసరమైన చట్టపరమైన చర్యలు తీసుకోవడం ప్రారంభించింది.
కొల్లూరులో ఆసియాలోనే అతిపెద్ద గృహ సముదాయం కేసీఆర్ నగర్ డబుల్ బెడ్రూం ఇళ్లని సీఎం కేసీఆర్ ప్రారంభించారు. ఆరుగురు లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలను అందించారు. అంతకుముందు డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణానికి సంబంధించిన ఫొటో ఎగ్జిబిషన్ సందర్శించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు కేటీఆర్, హరీశ్ రావు, సబితా ఇంద్రారెడ్డి, మల్లారెడ్డి, వేముల ప్రశాంత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఫ్రాన్స్‌లోని ఓ వ్యక్తి తన భార్యకు రోజూ రాత్రి మత్తుమందు ఇచ్చి, ఆపై పరపురుషులతో అత్యాచారం చేయించిన ఘటన వెలుగులోకి వచ్చింది. ఇలా 10 సంవత్సరాల పాటు చేసినట్లు చేసినట్లు తెలిసింది. దీనికి సంబంధించి 92 అత్యాచార కేసులను గుర్తించారు.
హైదరాబాద్‌లోని వైద్య కళాశాలల్లో రెండవ రోజు ఈడీ సోదాలు కొనసాగుతున్నాయి. హైదరాబాద్,మేడ్చల్ , రంగారెడ్డి జిల్లాల్లో దాదాపు 10 మెడికల్ కాలేజీలు, ఆస్పత్రుల్లో ఈడీ సోదాలు చేస్తోంది. 20 ప్రత్యేక బృందాలతో సోదాలు జరుగుతున్నాయి. ఇవాళ ఓవైసీ హాస్పిటల్లో కూడా ఈడీ అధికారులు సోదాలు చేపట్టారు.
హోండురాన్ లోని మహిళా జైలులో జరిగిన అల్లర్లలో కనీసం 41 మంది మహిళాఖైదీలు మరణించారు, వారిలో ఎక్కువ మంది మంగళవారం ముఠా కార్యకలాపాలతో ముడిపడి ఉన్న హింసలో కాల్చివేయబడ్డారు,హోండురాస్‌లోని మహిళా జైలులో ఉన్న ముఠా సభ్యులు మరో 41 మంది మహిళా ఖైదీలను తుపాకీతో కాల్చి, కొడవళ్లతో కొట్టి, ఆపై ప్రాణాలతో బయటపడిన వారిని వారి సెల్‌లలోకి లాక్కెళ్లి, మండే ద్రవంతో పోసి చంపినట్లు ఒక అధికారి బుధవారం తెలిపారు.
కుండపోత వర్షాల కారణంగా అసోంలో అనేక నదులు. నీటి మట్టాలు ప్రమాద స్థాయిని మించి ప్రవహిస్తున్నాయి . దీనితో వరదల కారణంగా 20 జిల్లాల్లో దాదాపు 1.20 లక్షల మంది నిరాశ్రయులయ్యారు. అస్సాం స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ (ASDMA) నివేదికల ప్రకారం అస్సాం స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ (ASDMA) వరద నివేదిక ప్రకారం, బక్సా, బార్పేట, దర్రాంగ్, ధేమాజీ, ధుబ్రి, కోక్రాఝర్, లఖింపూర్, నల్బారి, సోనిత్పూర్ మరియు ఉదల్గురి జిల్లాల్లో 1,19,800 మందికి పైగా ప్రజలు వరద బారిన పడ్డారు.
జేఈఈ మెయిన్ స్కోర్ తో ఎన్ఐటీలు, ట్రిపుల్ ఐటీల్లో సీటు రాని వారికి గుడ్ న్యూస్. ఈ స్కోరుతో ఢిల్లీలోని ప్రతిష్మాతక ఇంజనీరింగ్ సంస్దల్లో సీటు సంపాదించుకోవచ్చు. దేశంలో చాలా ఎన్ఐటీలు , ట్రిపుల్ ఐటీల కన్నా మంచి నాణ్యమైన సదుపాయాలు,విద్యను అందించే ఈ సంస్దల్లో నాన్ లోకల్ కోటా లో సీటు సంపాదించవచ్చని ప్రముఖ విద్యానిపుణుడు డాక్టర్ సతీష్ చెబుతున్నారు.