Home /Author anantharao b
ప్రధానమంత్రి నరేంద్రమోదీ శనివారం నాడు ప్రతిపక్షాలపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని మండిపడ్డారు. వాళ్లకే గ్యాంరటీ లేని వారు కొత్త కొత్త గ్యారంటీలతో పాటు కొత్త స్కీంలతో హామీలను ఇస్తున్నారని మోదీ అన్నారు.
భారత దేశ చరిత్రలో అతి పెద్ద విలీనం జరిగింది. శనివారం నాడు హెచ్డీఎఫ్సీ బ్యాంకులో మాతృ సంస్థ హెచ్డీఎఫ్సీ విలీనం అయ్యింది. దీంతో ప్రపంచంలోని అతి పెద్ద విలువైన బ్యాంకుల్లో హెచ్డీఎఫ్సీ బ్యాంకు నాలుగవ స్థానంలో నిలుస్తుంది
దేశంలో మరోసారి వస్తు, సేవల పన్ను(జీఎస్టీ) వసూళ్లు భారీగా నమోదయ్యాయి. జూన్ నెల వసూళ్లు 1 లక్ష 61 వేల497 కోట్లని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఇందులో సీజీఎస్టీ రూపంలో 31వేల 013 కోట్లు, ఎస్జీఎస్టీ కింద 38వేల 292 కోట్లు, ఐజీఎస్టీ కింద 80వేల 292 కోట్లు చొప్పున వసూలైనట్లు వెల్లడించింది.
సింగపూర్‌లో ఆత్మహత్యలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. గత ఏడాది ఆత్మహత్యలు 22 ఏళ్ల గరిష్టానికి చేరుకున్నాయి. క్రితం ఏడాదితో పోల్చుకుంటే ఆత్మహత్యలు 26 శాతం పెరిగాయి. నగరంలోని ప్రజలు ఏదో తెలియని మానసిక వ్యాధితో బాధపడుతున్నారని స్థానిక నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్ వెల్లడించింది.
ప్రముఖ పారిశ్రామికవేత్త అన్నా రామచంద్ర యాదవ్ శనివారం ప్రైమ్ 9 న్యూస్ ఛానెల్ సీఈవో పైడికొండల వెంకటేశ్వరరావు ను మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఈ సందర్బంగా తాజా రాజకీయపరిణామాలపై వీరు చర్చించారు.
ఇకనుంచి బీహార్ లో జరిగే ప్రతీ వివాహం పోలీసులకు ముందే తెలుస్తుంది. ప్రజలు తమ కుటుంబంలో జరిగే వివాహాలకు సంబంధించి సమాచారాన్ని స్దానిక పోలీసులకు తెలియజేయాలని లా అండ్ ఆర్డర్ ఏడీజీపీ సంజయ్ సింగ్ తెలిపారు.
పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు జూలై 20న ప్రారంభమై ఆగస్టు 11 వరకు కొనసాగుతాయని కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి శనివారం తెలిపారు. అన్ని పార్టీల నుండి ఉత్పాదక చర్చలు జరగాలని ఆయన ట్విట్టర్లో కోరారు.
2002 గుజరాత్ అల్లర్ల కేసుకు సంబంధించిన కేసుల్లో సాక్ష్యాధారాలు మరియు సాక్షులకు ట్యూటర్ని అందించిన ఆరోపణలకు సంబంధించి వెంటనే లొంగిపోవాలని సామాజిక ఉద్యమకారిణి తీస్తా సెతల్వాద్‌ను గుజరాత్ హైకోర్టు శనివారం ఆదేశించింది.
ఖమ్మం మాజీ ఎంపి పొంగులేటి శ్రీనివాస రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరుతున్న వేళ ఆయన అనుచరులపై పోస్టర్లు వెలిశాయి. మంత్రి పువ్వాడ అజయ్ కాళ్ళు పట్టుకుని క్షమించమని అడగకపోతే చంపేస్తామని, శవాన్ని దొరకనీయబోమని పొంగులేటి అనుచరుడు మువ్వా విజయ్బాబుని హెచ్చరించారు.
:ముఖ్యమంత్రి సహాయ నిధి కుంభకోణంపై సిఐడి దర్యాప్తులో విస్తుగొలిపే వాస్తవాలు వెలుగు చూస్తున్నాయి. ఉత్తుత్తి రోగులు, దళారులు, వైద్యులు, అధికారులు ఇలా అనేకమంది ఈ కుంభకోణంలో తమవంతు పాత్ర పోషించారని తేలింది. కుంభకోణానికి సంబంధించిన సాక్ష్యాధారాలు లభించడంతో అరెస్టులకి రంగం సిద్ధమైంది.