Pakistan Milk Prices: వామ్మో.. పాకిస్తాన్ లో లీటరు పాలధర 370 రూపాయలా..
పాకిస్తాన్లో కొత్త పన్నులు విధించిన తరువాత పాల ధరలు 20 శాతం పైగా పెరిగాయి. దీనితో కరాచీలోని సూపర్ మార్కెట్లలో లీటరు పాల ధర 370 రూపాయలకు చేరింది. తాజా పెంపుతో ఫ్రాన్స్, ఆస్ట్రేలియా మరియు కొన్ని ఇతర అభివృద్ధి చెందిన దేశాల కంటే పాల ధర పాకిస్తాన్ లో ఎక్కువగా ఉంది.
Pakistan Milk Prices: పాకిస్తాన్లో కొత్త పన్నులు విధించిన తరువాత పాల ధరలు 20 శాతం పైగా పెరిగాయి. దీనితో కరాచీలోని సూపర్ మార్కెట్లలో లీటరు పాల ధర 370 రూపాయలకు చేరింది. తాజా పెంపుతో ఫ్రాన్స్, ఆస్ట్రేలియా మరియు కొన్ని ఇతర అభివృద్ధి చెందిన దేశాల కంటే పాల ధర పాకిస్తాన్ లో ఎక్కువగా ఉంది.
ద్రవ్యోల్బణం పెరుగుతుంది..( Pakistan Milk Prices)
గత వారం జాతీయ బడ్జెట్లో ఆమోదించబడిన పన్నుల మార్పులలో భాగంగా ప్యాక్ చేసిన పాలపై 18% పన్ను విదించడమే పాల ధరలు పెరగడానికి కారణం. గతంలో దీనికి పన్ను మినహాయింపు ఉండేది.రిటైల్ ధరలు 25% వరకు పెరగడానికి ముందు, పాల ఖర్చులు వియత్నాం మరియు నైజీరియా వంటి అభివృద్ధి చెందుతున్న దేశాలతో సమానంగా ఉండేవని డచ్ పాల ఉత్పత్తిదారు రాయల్ ఫ్రైస్ల్యాండ్ కాంపినాయొక్క స్థానిక యూనిట్ ప్రతినిధి ముహమ్మద్ నాసిర్ చెప్పారు. ఇప్పటికే వేతనాలు అతి తక్కువగా ఉన్న పాకిస్తాన్ లో పాల ధరల పెరుగుదల ద్రవ్యోల్బణం పెరగడానికి కారణమవుతుందన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. దీనితో ప్రజలు ముఖ్యంగా చిన్నారులు పోషకాహారలోపానికి లోనవుతారని నాసిర్ అన్నారు, కొత్త బెయిలౌట్ కోసం అంతర్జాతీయ ద్రవ్య నిధి నిర్దేశించిన షరతులను చేరుకునే లక్ష్యంతో గత వారం బడ్జెట్లో పాకిస్తాన్ రికార్డు స్దాయిలో 40% పన్నులను విధించింది.