West Bengal jobs scam: ఉద్యోగాల కుంభకోణం.. పశ్చిమ బెంగాల్ లో రైసు మిల్లుల్లో ఈడీ సోదాలు
ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) బుధవారం ఉదయం పశ్చిమ బెంగాల్‌లోని నాడియా జిల్లాలో నాలుగు చోట్ల రైస్ మిల్లుల్లో సోదాలు నిర్వహించింది. ఉద్యోగాల కుంభకోణంపై కొనసాగుతున్న విచారణకు సంబంధించి ఈ సోదాలు నిర్వహించినట్లు ఒక అధికారి తెలిపారు.
West Bengal jobs scam:ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) బుధవారం ఉదయం పశ్చిమ బెంగాల్‌లోని నాడియా జిల్లాలో నాలుగు చోట్ల రైస్ మిల్లుల్లో సోదాలు నిర్వహించింది. ఉద్యోగాల కుంభకోణంపై కొనసాగుతున్న విచారణకు సంబంధించి ఈ సోదాలు నిర్వహించినట్లు ఒక అధికారి తెలిపారు.
ఈడీ విచారణకు అభిషేక్ బెనర్జీ భార్య..(West Bengal jobs scam)
శాంతిపూర్, ధుబులియా, రాణాఘాట్, కృష్ణానగర్‌లోని మిల్లుల్లో జరిగిన సోదాల సందర్బంగా కేంద్ర భద్రతా బలగాలు కాపలాగా ఉన్నాయి. ..ఉద్యోగాల కుంభకోణం నుండి సేకరించిన మొత్తంలో రైస్ మిల్లులలో పెట్టుబడి పెట్టారు. దానిని నిరూపించే పత్రాలు మా వద్ద ఉన్నాయి. నేటి దాడులు దీనికి సంబంధించి జరుగుతున్నాయని ఈడీ అధికారి తెలిపారు. మరోవైపు ఇదే స్కామ్‌కు సంబంధించి తృణమూల్ కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి అభిషేక్ బెనర్జీ భార్య రుజీరా బెనర్జీ సిటీ కార్యాలయంలో ఈడీ అధికారుల ఎదుట విచారణకు హాజరయ్యారని అధికారి తెలిపారు.
పశ్చిమ బెంగాల్ టీచర్ల రిక్రూట్‌మెంట్ కుంభకోణం కేసు దర్యాప్తును వేగవంతం చేసేందుకు సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) ఈ ఏడాది ఏప్రిల్ లో ప్రత్యేక టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేసింది. ఈ మేరకు కొనసాగుతున్న విచారణలో మరో ఏడుగురు అధికారులను చేర్చారు మరియు విచారణలో చేరడానికి అధికారులను కోల్‌కతా బ్యూరోకు పంపారు.అధికారులందరూ కోల్‌కతాలోని అవినీతి నిరోధక బ్యూరో DIG, CBIకి రిపోర్ట్ చేస్తారు. ఢిల్లీ, విశాఖపట్నం, భువనేశ్వర్, ధన్‌బాద్ మరియు భోపాల్‌ల నుండి ప్రత్యేక టాస్క్‌ఫోర్స్ అధికారులను చేర్చుకున్నారు.
సీబీఐ ప్రకారం, 2014 మరియు 2021 మధ్య పశ్చిమ బెంగాల్‌లోని ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయులు మరియు సిబ్బందిని నియమించడానికి ఉద్యోగ ఆశావహుల నుండి టిఎంసి నాయకులు రూ. 100 కోట్లకు పైగా సేకరించినట్లు ఆరోపణలు వచ్చాయి.గత సంవత్సరం, రాష్ట్ర మాజీ విద్యా మంత్రి పార్థ ఛటర్జీ సర్వీస్ కమిషన్ రిక్రూట్‌మెంట్‌లో అరెస్టయ్యాడు. దీనితోమమతా బెనర్జీ ప్రభుత్వం పై ప్రతిపక్షాల నుండి దాడి తీవ్రమయింది.