Cockroach in chutney: చట్నీలో బొద్దింక.. వాంతులు చేసుకొన్న విద్యార్ధులు
ఆడుతూ పాడుతూ పాఠశాలకు చేరుకొన్నారు వారంతా. అర్ధగంటలో సీన్ మారిపోయింది. ఒక్కసారిగా అందరూ వాంతులు చేసుకొన్నారు. ఆరా తీస్తే వారు తిన్న చట్నీలో బొద్దింక ఉన్నట్లు గుర్తించారు. ఈ ఘటన అనకాసపల్లి జిల్లాలో చోటుచేసుకొనింది
Anakapalli: వివరాల మేరకు పరవాడ మండలం తానాం ప్రభుత్వ బీసీ బాలుర వసతి గృహంలో 102మంది విద్యార్ధులు ఉన్నారు. రోజువారీగానే బుధవారం ఉదయం 95మంది విద్యార్ధులు అల్పహారం కింద ఇడ్లీ చట్నీ తిన్నారు. అర్ధ గంట తర్వాత సమీపంలోని ప్రభుత్వ పాఠశాలకు విద్యార్ధులు చేరుకొన్నారు. ఇంతలో హాఠాత్తుగా విద్యార్ధులంతా కడుపు నొప్పి అంటూ పొట్ట చేత్తో పట్టుకొన్నారు. అనంతరం 51మంది విద్యార్ధులకు వాంతులు అయ్యాయి. కంగారు పడిన ఉపాధ్యాయులు విషయాన్ని ఉన్నతాధికారులకు తెలియచేశారు. సమాచారం అందుకొన్న స్థానిక పిహెచ్ సి వైద్య సిబ్బంది విద్యార్ధులకు చికిత్స అందించారు. కొద్ది సేపటికి విద్యార్ధుల ఆరోగ్య పరిస్ధితి నిలకడకు చేరుకోవడంతో అందరూ ఊపిరి పీల్చుకొన్నారు. ఘటనను తెలుసుకొన్న రెవిన్యూ, పోలీసు సిబ్బంది విద్యార్ధుల నుండి వివరాలు సేకరించారు. చట్నీలో బొద్దింక ఉందని, అది తినడం వల్లే అస్వస్ధతకు గురైన్నట్లు విద్యార్ధులు వెల్లడించారు.