Tamilnadu CM Stalin: గవర్నర్లకు నోరు మాత్రమే ఉంది.. చెవులు లేవు.. తమిళనాడు సీఎం స్టాలిన్
తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్ గురువారం రాష్ట్రాల గవర్నర్లపై విరుచుకుపడ్డారు. వారికి నోరు మాత్రమే ఉంది, చెవులు లేవని అనిపిస్తుందని అన్నారు.
Tamilnadu CM Stalin: తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్ గురువారం రాష్ట్రాల గవర్నర్లపై విరుచుకుపడ్డారు. వారికి నోరు మాత్రమే ఉంది, చెవులు లేవని అనిపిస్తుందని అన్నారు.
తమిళనాడు ముఖ్యమంత్రి ఎమ్.కె. స్టాలిన్ గురువారం రాష్ట్రాల గవర్నర్లపై విరుచుకుపడ్డారు. గవర్నర్ రాజకీయాల్లో జోక్యం చేసుకోకూడదని సుప్రీంకోర్టు తెలిపిందని ఆయన గుర్తు చేసారు.
యాంటీ గ్యాంబ్లింగ్ బిల్లును తిప్పి పంపిన గవర్నర్..(Tamilnadu CM Stalin)
స్టాలిన్ యొక్క వ్యాఖ్యలు ఇటీవల యాంటీ గ్యాంబ్లింగ్ బిల్లును తమిళనాడు గవర్నర్ – ఆర్ఎన్ రవి తిప్పి పంపిన నేపధ్యంలో ఉద్దేశించినవని భావిస్తున్నారు.ఇది ఆన్‌లైన్ జూదం మరియు ఆన్‌లైన్ ఆటల నియంత్రణను నిషేధించింది. గత ఏడాది అక్టోబర్‌లో రాష్ట్ర న్యాయ మంత్రి రఘుపతి ప్రవేశపెట్టిన బిల్లుకు కూడా గవర్నర్ రాష్ట్ర ప్రభుత్వం నుండి మరింత వివరణ కోరారు. జస్టిస్ చంద్రు ప్యానెల్ సమర్పించిన నివేదిక ఆధారంగా ఆన్‌లైన్ రమ్మీ ఆటలను నిషేధించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.బిల్లులో ఆన్‌లైన్ జూదం, ఆన్‌లైన్ గేమ్స్ ,డబ్బు మరియు ఇతర రకాల పందెం మరియు ఏ మీడియాలోనైనా ప్రకటనలు ప్రత్యక్షంగా మరియు పరోక్షంగా ఆడటానికి ప్రేరేపించేవి ఉన్నాయి. బ్యాంకులు, ఆర్థిక సంస్థలు లేదా చెల్లింపు గేట్‌వేలు లావాదేవీలలో పాల్గొనలేవు.
పుకార్ల వెనుక బీజేపీ ఎంపీలు..
తమిళనాడులో బీహార్ వలస కార్మికులపై దాడి చేసినట్లు నార్త్ ఇండియన్ స్టేట్స్ నుండి బీజేపీ ఎంపీలు నకిలీ వార్తలను’ వ్యాప్తి చేశారని స్టాలిన్ ఆరోపించారు. ఇది తన ప్రభుత్వానికి వ్యతిరేకంగా ‘రాజకీయంగా ప్రేరేపించబడినదిగా ఆయన పేర్కొన్నారు. సోషల్ మీడియాలో వైరల్ అయిన మరియు కొన్ని మీడియా ప్రచురణల ద్వారా పంచుకున్న పుకార్లను ఎత్తి చూపారు. 2024 ఎన్నికలకు ముందు పాలక భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా ఏకం కావాలని ఆయన ప్రతిపక్షానికి పిలుపునిచ్చారు. ఈ నకిలీ వార్తలను నేను విచారించాను. బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ తో మాట్లాడాను. తమిళనాడులో అలాంటి సంఘటనలు లేవు. బీహార్ వెళ్లిన మన ప్రతినిధులు కూడా పూర్తి సంతృప్తితో తిరిగి వచ్చారని స్టాలిన్ తెలిపారు.
ప్రతిపక్ష నేత ప్రధాని కావాలి..
ఈ సందర్బంగా ఆయన గత వారం చేసిన వ్యాఖ్యలను ప్రస్తావించారు. తన పుట్టినరోజు వేడుకలో -ప్రతిపక్షానికి చెందని నేత ప్రధాన మంత్రి కావాలని స్టాలిన్ పిలుపునిచ్చారు.తమిళులు బ్రదర్‌హుడ్‌ను ప్రేమిస్తున్నారని ఇది ఇక్కడ ఉత్తర రాష్ట్ర సోదరులకు బాగా తెలుసు’ అని అన్నారు. బీజేపీకి వ్యతిరేకంగా ఐక్య, జాతీయ స్థాయి కూటమి యొక్క అవసరం గురించి నేను మాట్లాడిన మరుసటి రోజు ఈ పుకార్లు వ్యాప్తి చెందడం గురించి మీరు అర్థం చేసుకోవచ్చు. కొంతమంది నకిలీ వీడియోలను సృష్టించారని స్టాలిన్ ఆరోపించారు.
తమిళనాడులో వస్త్రాలు మరియు నిర్మాణంరంగాలలో పనిచేసే వారిలో బీహార్ వంటి ఉత్తరాది రాష్ట్రాల నుండి ఎక్కువ మంది కార్మికులు ఉన్నారు.మార్చి 1 నుండి నాలుగు వీడియోలు బీహార్ వలసదారులపై భయంకరమైన దాడులు జరిగాయంటూ ప్రసారం చేయడం ప్రారంభించాయి. తమిళనాడు పోలీసులు దీనిపై దర్యాప్తు చేయగా కొందరు వ్యక్తులు కావాలనే చేసినట్లు వెల్లడయింది. దీనితో బీజేపీకి చెందిన వ్యక్తులు, సంస్దలపై 12 ఎఫ్ఐఆర్ లను దాఖలు చేసినట్లు రాష్ట్ర సీనియర్ అధికారి తెలిపారు. బీహార్ పోలీసులు ఒక వ్యక్తిని అరెస్ట్ చేసి తప్పుడు సమాచారం పంపిణీ చేసినందుకు ఇతరులపై కేసులు దాఖలు చేశారు.