Road Accidents : మీకు తెలుసా? రిషబ్ పంత్ మాదిరే ఐదుగురు క్రికెటర్లు రోడ్డు ప్రమాదాల్లో చిక్కుకున్నారు..
Road Accidents : భారత క్రికెటర్ రిషబ్ పంత్ కారు ప్రమాదానికి గురయింది. అయితే అదృష్టవశాత్తూ అతను ప్రాణాలతో బయటపడ్డాడు . గతంలో కూడా మన్సూర్ అలీ
Road Accidents : భారత క్రికెటర్ రిషబ్ పంత్ కారు ప్రమాదానికి గురయింది. అయితే అదృష్టవశాత్తూ అతను ప్రాణాలతో బయటపడ్డాడు . గతంలో కూడా మన్సూర్ అలీ ఖాన్ పటౌడీ నుండి ఆండ్రూ సైమండ్స్ వరకు, 5 మంది క్రికెటర్లు రోడ్డు ప్రమాదాల్లో చిక్కుకున్నారు.
1961లో ఆక్స్‌ఫర్డ్ సస్సెక్స్‌లో ఆడుతుండగా భారత్‌కు కు చెందిన మాక్ పటౌడీ ఇంటికి వెళ్తుండగా ప్రమాదంలో చిక్కుకున్నారు. ఆయన ఆటోలో వెళ్తుండగా ఎదురుగా వస్తున్న మరో వాహనం ఢీకొట్టింది. అతన్ని సమీపంలోని ఆసుపత్రికి తీసుకువెళ్లారు.అయితే ప్రాణాలకు ప్రమాదం తప్పినా కుడికంటికి తీవ్రగాయమయింది. వెస్టిండీస్ ఆల్-రౌండర్ కోలీ స్మిత్26 సంవత్సరాల వయస్సులో రోడ్డు ప్రమాదంలో మరణించాడు. అతని సహచరులు టామ్ డ్యూడ్నీ మరియు గ్యారీ సోబర్స్ తో కలిసి ఒక ఛారిటీ గేమ్ కోసం లండన్‌కు వెళుతుండగా స్టాఫోర్డ్‌షైర్‌లో పశువుల ట్రాక్టర్‌ను వారి ఆటో ఢీకొనడంతో తీవ్రంగా గాయపడి కోమాలో ఉండి మరణించాడు.
వెస్టిడీస్ కు చందిన మరో క్రికెటర్ రునాకా మార్టన్ 2012లో తన కారు పోల్ ను డీకొట్టడంతో ట్రినిడాడ్ లో మరణించాడు. భారత్ కు చెందిన స్పిన్నర్ సాయిరాజ్ బహుతులే నడుపుతున్న కారు మెరైన్ డ్రైవ్‌లో ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో అతనికి తీవ్రగాయాలవగా కారులో ఉన్న స్నేహితుడు మరణించాడు.
బహతులే కుడి కాలికి రాడ్ అమర్చారు. అయితే ఒక సంవత్సరం తర్వాత అతను తిరిగి క్రికెట్ ఆడాడు. ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ మరియు రెండుసార్లు ప్రపంచ కప్ విజేత ఆండ్రూ సైమండ్స్ కారు ప్రమాదంలో మరణించారు. అతని స్వస్థలమైన క్వీన్స్‌లాండ్ లోని టౌన్స్‌విల్లే వెలుపల ఈ ప్రమాదం జరిగింది.