iQOO 13 5G Massive Discount: షాపింగ్‌కు సిద్దంకండి.. రూ.4,316కే ఐక్యూ కాస్ట్‌లీ ఫోన్.. డీల్స్ చూస్తే మైండ్ బ్లాక్..!

iQOO 13 5G Massive Discount: టెక్ మార్కెట్లో స్మార్ట్‌ఫోన్‌లు కుప్పలు కుప్పలుగా ఉన్నాయి. దీంతో మంచి ఫోన్‌ను కనుగొనడం చాలా కష్టమైన పనిగా మారింది. ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్‌ల విషయానికి వస్తే, చాలా మంది దృష్టి సామ్‌సంగ్, ఆపిల్ ఐఫోన్‌ల వైపు మాత్రమే ఉంటుంది. అయితే ప్రస్తుతం ఫ్లాగ్‌షిప్ సెగ్మెంట్‌లో ఐక్యూ స్మార్ట్‌ఫోన్‌లు ఎక్కువ సందడి చేస్తున్నాయి. ‘iQOO 13 5G’ కూడా అటువంటి స్మార్ట్‌ఫోన్‌లలో ఒకటి, దీని డిజైన్, ఫీచర్స్ కారణంగా ఎప్పుడు చర్చల్లో ఉంటుంది. ఇప్పుడు ఈ స్మార్ట్‌ఫోన్‌ను చౌకగా కొనుగోలు చేయచ్చు. ఈ ఆఫర్ పూర్తి వివరాలు తెలుసుకుందాం.
పనితీరు లేదా ఫ్లాగ్‌షిప్ స్థాయి కెమెరా సెటప్ అయినా, iQOO 13 5G ప్రతి విభాగంలోని ఫోన్‌లకు గట్టి పోటీని ఇస్తుంది. మీరు ఈ స్మార్ట్‌ఫోన్‌ను రోజువారీ పని కోసం అలాగే భారీ పనులు, గేమింగ్ కోసం ఉపయోగించవచ్చు. ఫోటోగ్రఫీ ప్రియుల కోసం, కంపెనీ 50+50+50 మెగాపిక్సెల్‌ల ట్రిపుల్ కెమెరా సెటప్‌ను అందించింది. ఈ స్మార్ట్‌ఫోన్ ధరను అమెజాన్ భారీగా తగ్గించింది. ఇప్పుడు మీరు భారీ తగ్గింపుతో కొనుగోలు చేయవచ్చు.
iQOO 13 5G Offers
iQOO 13 256GB స్మార్ట్‌ఫోన్ అమెజాన్ వెబ్‌సైట్‌లో రూ. 61,999 ధరతో అందుబాటులో ఉంది. కంపెనీ తన ధరను 11శాతం తగ్గించింది. ఈ తగ్గింపు తర్వాత కంపెనీ ఈ స్మార్ట్‌ఫోన్‌ను రూ. 54,998 ధరకు విక్రయిస్తోంది. ఎంపిక చేసిన బ్యాంక్ కార్డ్ కస్టమర్లకు కంపెనీ రూ. 2000 వరకు తక్షణ తగ్గింపును అందిస్తోంది. మీ బడ్జెట్ తక్కువగా ఉంటే, మీరు ఈ ఫోన్‌ను EMIలో కూడా కొనుగోలు చేయచ్చు. కేవలం రూ.4316తో నెలవారీ EMIతో దీన్ని కొనుగోలు చేసి ఇంటికి తీసుకెళ్లచ్చు.
అమెజాన్ iQOO 13 5Gపై బలమైన ఎక్స్ఛేంజ్ ఆఫర్‌ను కూడా అందిస్తోంది. మీ వద్ద పాత స్మార్ట్ ఫోన్ ఉంటే దానిని ఎక్స్ ఛేంజ్ చేసుకోవడం ద్వారా రూ.22,800 వరకు ఆదా చేసుకోవచ్చు. మీరు ఈ ఆఫర్ పూర్తి విలువను పొందినట్లయితే మీరు iQOO 13 5Gని కేవలం రూ. 32198కి కొనుగోలు చేయచ్చు.
iQOO 13 5G Specifications
iQOO 13 5Gలో, కంపెనీ అల్యూమినియం అల్లాయ్ ఫ్రేమ్‌తో గ్లాస్ బ్యాక్ డిజైన్‌ను అందించింది. ఈ స్మార్ట్‌ఫోన్‌లో IP68, IP69 రేటింగ్ ఉంది. అలానే 6.82 అంగుళాల LTPO అమోలెడ్ డిస్‌ప్లే ప్యానెల్‌ను ఉంది. ఇది 144Hz రిఫ్రెష్ రేట్‌కు సపోర్ట్ ఇస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ 15లో రన్ అవుతుంది. స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ చిప్‌సెట్‌తో పనిచేస్తుంది.16జీబీ ర్యామ్, 1TB వరకు ఇంటర్నల్ స్టోరేజ్‌తో వస్తుంది. ఫోటోగ్రఫీ కోసం వెనుక ప్యానెల్‌లో 50+50+50 మెగాపిక్సెల్ ట్రిపుల్ కెమెరా సెటప్ అందుబాటులో ఉంది.సెల్ఫీ, వీడియో కాలింగ్ కోసం, ముందు భాగంలో 32 మెగాపిక్సెల్ సెన్సార్‌తో కూడిన కెమెరా అందించారు. ఈ స్మార్ట్‌ఫోన్‌లో 6000mAh బ్యాటరీ ఉంది. ఈ బ్యాటరీ 120W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ ఇస్తుంది.