Shivaraj Kumar: RC16 సెట్లో అడుగుపెట్టిన శివరాజ్ కుమార్ – లుక్ టెస్ట్ పూర్తి, వీడియో చూశారా?

Shivaraj Kumar Look Test Completed: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సాన దర్శకత్వంలో ఓ భారీ ప్రాజెక్ట్ తెరకెక్కుతోంది. ఆర్సీ 16(RC16) అనే వర్కింగ్ టైటిల్‌తో ఈ చిత్రం రూపొందుతోంది. దీనికి పెద్ది అనే టైటిల్ ప్రచారంలో ఉంది. స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్‌లో ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఇందులో జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తుండగా.. కన్నడ సూపర్ స్టార్, కరుణాడ చక్రవర్తి శివరాజ్ కుమార్ కీలక పాత్రలో నటించనున్నారు. ఇప్పటికే దీనిపై అధికారిక ప్రకటన కూడా వచ్చింది.
తాజాగా ఆయన లుక్ టెస్ట్ కంప్లీట్ చేసింది మూవీ టీం. ఇక త్వరలోనే ఆయన రెగ్యూలర్ షూటింగ్లో జాయిన్ కానున్నారని మూవీ టీం తెలిపింది. ఈ మేరకు మూవీ నిర్మాణ సంస్థ వృద్ధి సినిమాస్ ఓ వీడియో కూడా రిలీజ్ చేసింది. ఇందులో శివరాజ్ కుమార్ తన తండ్రి ఫోటోలకు నమస్కరించి.. ఆ తర్వాత ఆర్సీ16 సెట్లోకి అడుగుపెట్టినట్టు చూపించారు. ఆ తర్వాత డైరెక్టర్ బుచ్చిబాబు, ఇతర చిత్ర బృందం ఆధ్వర్యంలో ఆయన లుక్‌ని టెస్ట్ చేశారు.
ఫైనల్‌గా అద్భుమైన లుక్‌ని ఫిక్స్ చేసినట్టు మూవీ టీం పేర్కొంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. ఇక రామ్ చరణ్ Rc16 షూటింగ్ శరవేగంగా ముందుకు వెళ్తుండటంతో అభిమానుల్లో అంచనాలు పెరిగిపోతున్నాయి. స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్‌లో ఈ సినిమా రూపొందుతోంది. ఉప్పెన వంటి బ్లాక్‌బస్టర్ హిట్ తర్వాత బుచ్చిబాబు తెరకెక్కిస్తున్న చిత్రం కావడంతో మూవీ అంచనాలు నెలకొన్నాయి. ఉప్పెన తర్వాత దాదాపు రెండేళ్లు ఈ మూవీ స్క్రిప్ట్‌పైనే వర్క్ చేసి చరణ్ కోసం అద్భుతమైన కథను రెడీ చేశాడు. ఇందులో రామ్ చరణ్ పాత్ర పవర్‌ఫుల్‌గా తీర్చిదిద్దినట్టు ఆయన చెప్పారు.
Completed the look test of Karunada Chakravarthy @NimmaShivanna Garu for #RC16
He is all set for a stunning makeover for his character, that will be both breathtaking and sensational 💥
He will be joining the shoot soon.#RamCharanRevolts
Global… pic.twitter.com/4BjHcBxrpH— Vriddhi Cinemas (@vriddhicinemas) March 5, 2025
శివరాజ్ కుమార్‌తో పాటు టాలీవుడ్ విలక్షణ నటుడు జగపతి ఈ చిత్రంలో కీలక పాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమాకు ఆస్కార్ అవార్డు గ్రహిత ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్, వృద్ధి సినిమాస్, సుకుమార్ రైటింగ్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ మూవీ షూటింగ్లో భాగంగా త్వరలోనే చిత్ర బృందం ఢిల్లీ వేళ్లనుంది. కాగా ఇటీవల శివరాజ్ కుమార్ విదేశాల్లో క్యాన్సర్‌కు చికిత్స తీసుకుని ఇండియాకు వచ్చిన సంగతి తెలిసిందే. కొద్ది రోజులు విశ్రాంతి అనంతరం ఆయన RC16 సెట్లో జాయిన్ కాబోతున్నారు.