Last Updated:

Moon Network: చంద్రుడిపై సెల్ టవర్‌..!

Moon Network: చంద్రుడిపై సెల్ టవర్‌..!

Moon NetworkG: నాసా అనుకున్న మిషన్‌ పూర్తయితే చంద్రుడిపైన త్వరలోనే ఫోన్‌ సిగ్నల్‌ సేవలు ప్రారంభమయ్యే అవకాశం ఉంది. అంటే నేరుగా చంద్రుడి మీద నుంచి భూమ్మీద ఉన్నవారికి వ్యోమగాములు ఫోన్‌ చేసే అవకాశం రాబోతున్నది! అమెరికాలోని ఫ్లోరిడాలో ఉన్న కెన్నడీ అంతరిక్ష కేంద్రం నుంచి బుధవారం స్పేస్‌ ఎక్స్‌ ఫాల్కన్‌ రాకెట్‌ ప్రయోగించారు.

నాసా అనుకున్న మిషన్‌ పూర్తయితే చంద్రుడిపైన త్వరలోనే ఫోన్‌ సిగ్నల్‌ సేవలు ప్రారంభమయ్యే అవకాశం ఉంది. అంటే నేరుగా చంద్రుడి మీద నుంచి భూమ్మీద ఉన్నవారికి వ్యోమగాములు ఫోన్‌ చేసే అవకాశం రాబోతున్నది! అమెరికాలోని ఫ్లోరిడాలో ఉన్న కెన్నడీ అంతరిక్ష కేంద్రం నుంచి బుధవారం స్పేస్‌ ఎక్స్‌ ఫాల్కన్‌ రాకెట్‌ ప్రయోగించారు. ఇది ఈ నెల 6న చంద్రుడిని చేరే అవకాశం ఉంది.

ఇందుకు సంబంధించిన ఐఎమ్‌-2 మిషన్‌లోని ఎథెనా మూన్‌ ల్యాండర్‌ చంద్రుడిపై ఖనిజాలను అన్వేషించడంతో పాటు అక్కడ సెల్యూలర్‌ నెట్‌వర్క్‌ సేవల సాధ్యంపై సమగ్ర పరిశోధన చేయనుంది. నోకియా కంపెనీ సాయంతో నాసా చంద్రుడిపై మొబైల్‌ నెట్‌వర్క్‌ను అభివృద్ధి చేయనుంది. ఇప్పటివరకు రేడియో తరంగాల ద్వారా మాత్రమే చంద్రుడి నుంచి భూమి మీదకు కమ్యూనికేషన్‌ చేసే అవకాశం ఉండేది.

భూమి మీద ఉపయోగించే సెల్యూలర్‌ సాంకేతికతనే చంద్రుడిపైనా ఉపయోగించవచ్చని ఫిబ్రవరి 2023లో నోకియా ప్రాథమికంగా గుర్తించింది. ఈ నేపథ్యంలో ఈ జనవరిలో చంద్రుడి ఉపరితల కమ్యూనికేషన్‌ వ్యవస్థ(ఎల్‌ఎస్‌సీఎస్‌) ను ఎథెనా ల్యాండర్‌లో పొందుపరిచి ఐఎమ్‌-2 మిషన్‌లో ప్రయోగించినట్టు నోకియా వెల్లడించింది. ఈ వ్యవస్థను ఒక నెట్‌ వర్క్‌ బాక్స్‌లో సరిపోయేలా రూపొందించారు.

ఇవి కూడా చదవండి: