Director Sukumar: సినిమాలు వదిలేస్తా – డైరెక్టర్ సుకుమార్ సంచలన కామెంట్స్
Sukumar Said He Quits Movies: టాలీవుడ్ స్టార్ డైరెక్టర్లలో సుకుమార్ ఒకరు. ఈయన డైరెక్షన్, మేకింగ్ ప్రత్యేకమైన శైలి ఉంటుంది. ఆయన సినిమాలంటే యూత్‌లో యమ క్రేజ్ ఉంది. సినిమాలకు ముందు లెక్కల మాస్టర్‌గా పని చేసిన ఆయన ‘ఆర్య’ చిత్రంతో దర్శకుడిగా తెరంగేట్రం చేశారు. తొలి మూవీతోనే భారీ విజయం సాధించారు. అంతేకాదు ఈ సినిమాకి ఇప్పటికీ యూత్‌లో ఇప్పటికీ అదే క్రేజ్ ఉంది. అంతగా తన మేకింగ్, టేకింగ్‌తో ఆడియన్స్ ఆకట్టుకునే ఈ లెక్కల మాస్టర్ ఖాతాలో ఎన్నో హిట్స్, బ్లాక్‌బస్టర్ చిత్రాలు ఉన్నాయి. దాదాపు ఈయన దర్శకత్వంలో వచ్చిన సినిమాలన్ని భారీ విజయం సాధించాయి.
తాజాగా పుష్ప 2 భారీ స్థాయిలో ఇండస్ట్రీ హిట్ కొట్టారు. మొదటి సారిగా బాలీవుడ్ బాక్సాఫీసు ఏలిన సినిమా ఏదైన ఉందంటే అది ‘పుష్ప 2’నే. అయితే ఇదిలా ఉంటే తాజాగా ఈ సుకుమార్ ఓ సంచటన స్టేట్‌మెంట్ ఇచ్చారు. ఇటీవల అమెరికాలో జరిగిన గేమ్ ఛేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి ఆయన చీఫ్ గెస్ట్‌గా హాజరైన సంగతి తెలిసిందే. అక్కడ ప్రీ రిలీజ్ ఈవెంట్‌తో పాటు ‘ధోప్’ లిరికల్ సాంగ్‌ని విడుదల చేశారు. ఈ సందర్భంగా షో హోస్ట్ సుమ సుకుమార్‌ను ఓ ప్రశ్న అడిగారు. ధోప్ అంటే వదిలిపెట్టడం అని అర్థం. దీనికి సుమ ఆయన దగ్గరికి వచ్చి సుకుమార్ గారు మీరు ధోప్ అని దేనినైన ఒకటి వదిలేయాలంటే అని ఏం విడిచిపెడతారు? అని ప్రశ్నించారు.
Papam ra SUKKU 😢
Waiting for your huge comeback with RC17 ♥️🔥#RamCharan𓃵 #Pushpa2TheRule#Sukumar #RC17pic.twitter.com/LyeJMBPCDK— Negan (@Negan_000) December 23, 2024
దీనికి సుకుమార్ ‘సినిమా’ అని సమాధానం ఇచ్చాడు. ఇది విని యాంకర్ సుమతో పాటు పక్కనే రామ్ చరణ్ కూడా షాక్ అయ్యాడు. నో ఇది క్యాన్సిల్ అంటూ సమ అరుస్తుంది. వెంటనే మైక్ తీసుకున్న చరణ్.. “పది సంవత్సరాల నుంచి ఆయన ఇదే చెబుతూ అందరిని బయపెట్టిస్తున్నారు. అలా ఏం జరగదు” అంటాడు. ప్రస్తుతం సుకుమార్ కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నారు. ‘పుష్ప 2’ రిలీజ్ సందర్భంగా సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మృతి చెందిన సంగతి తెలిసిందే. థియేటర్‌కి అల్లు అర్జున్ వెళ్లడంతో ఆయనను చూసేందుకు ఒక్కసారిగా జనం ఎగబడ్డాడు.
ఈ క్రమంలో అక్కడ తొక్కిసలాట చోటుచేసుకోగా మహిళ మరణించగా.. ఇదే ఘటనలో తీవ్రంగా గాయపడ్డ ఆమె కుమారుడు కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ప్రస్తుతం అతడి ఆరోగ్య పరిస్థితి అంతంత మాత్రంగానే ఉంది. అయితే ఈ ఘటనపై సుకుమార్ పుష్ప 2 సక్సెస్ మీట్‌లో ఆవేదన వ్యక్తం చేశారు. తన భార్యతో కలిసి బాధిత కుటుంబాన్ని పరామర్శించిన తనవంతుగా ఆర్థిక సాయం కూడా అందించారు. అయితే తన సినిమా థియేటర్‌లో తొక్కిసలాట చోటుచేసుకోవడం, ఈ ఘటనలో మహిళ మరణించడం..ఓ బాలుడు ప్రాణప్రాయ స్థితిలో ఉండటం.. అల్లు అర్జున్ అరెస్ట్ వంటి పరిణామల మధ్య ఆయన తీవ్ర ఒత్తిడికి లోనవుతున్నట్టు కనిపించారు. ఆ ప్రభావం వల్లే ఆయన గేమ్ ఛేంజర్ ఈవెంట్‌లో ఈ కామెంట్స్ చేసి ఉంటారని సుక్కు ఫ్యాన్స్ అంతా అభిప్రాయపడుతున్నారు.