Published On:

Python Caught: మామిడితోటలో నెమలిని మింగిన 15 అడుగుల భారీ కొండచిలువ.. వీడియో వైరల్

Python Caught: మామిడితోటలో నెమలిని మింగిన 15 అడుగుల భారీ కొండచిలువ.. వీడియో వైరల్

15 feet Python Swalloweda Peacock: కొండచిలువ చూస్తేనే గుండె జల్లుమంటోంది. అలాంటిది ఓ మామిడితోటలో పనిచేస్తున్న కూలీలకు ఏకంగా 15 అడుగుల కొండచిలువ కనిపించింది. దీంతో భయాందోళనకు గురై పరుగులు తీశారు. ఈ ఘటన తెలంగాణలోని మహబూబ్ నగర్ జిల్లా పెద్దమందడి మండలంలో ఉన్న చిక్కటోనిపల్లి శివారులో చోటుచేసుకుంది.

 

చిక్కటోనిపల్లి గ్రామానికి చెందిన రిటైర్డ్ ఎస్పీ సర్వేశ్వర్ రెడ్డి మామిడి తోటలో ఉదయం కూలీలు పనులు చేస్తున్నారు. ఇంతలో వాళ్లకు పొదల మధ్య అలజడి వచ్చింది. కొంతమంది కూలీలకు డౌట్ వచ్చి చూడగా.. 15 అడుగుల భారీ కొండచిలువను చూసి ఉలిక్కిపడ్డారు. అక్కడే ఉన్న మహబూబ్‌కు సమాచారం ఇవ్వగా.. వెంటనే మామిడి తోట యజమాని సర్వేశ్వర్ రెడ్డికి విషయాన్ని తెలియజేశారు. ఆయన పెద్దమందడి ఎస్ఐ శివకుమార్‌కు విషయాన్ని తెలియజేశారు.

 

పోలీసులు వెంటనే స్నేక్ సొసైటీ నిర్వాహకులు సమాచారం ఇచ్చారు. పోలీసుల సహకారంతో స్నేక్ సొసైటీ నిర్వాహకులు ఆ భారీ కొండచిలువను చాకచక్యంగా పట్టుకున్నారు. అయితే ఇది నెమలిని మింగినట్లు ప్రాథమికంగా నిర్ధారిస్తున్నారు. నెమలిని మింగి మామిడి చెట్టు వద్దనే పడుకున్నట్లు స్నేక్ నిర్వాహకులు చెబుతున్నారు. అటవీ శాఖ అధికారుల సూచనమేరకు ఈ భారీ కొండచిలువను అడవిలో వదిలేస్తామని చెప్పారు.

 

ఇదిలా ఉండగా, 15 అడుగుల భారీ కొండచిలువను ఇదే మొదటిసారి చూశామని స్నేక్ క్యాచర్ కృష్ణ సాగర్ తెలిపారు. ఇంద పెద్ద కొండచిలువ చూడడం జీవితంలో ఇదే తొలిసారి అని అక్కడ ఉన్న కూలీలు సైతం అన్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి.