Last Updated:

Somasila: చెక్కిన శిల్పం.. ప్రకృతి అందాలు.. మనమూ చూసొద్దాం రండి

Somasila: తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక.. పర్యాటక రంగంలో ప్రపంచానికే తెలంగాణ తలమానికంగా నిలుస్తుంది. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన కట్టడాలు.. దేవతలు, ఆకుపచ్చని అరణ్యాలకు నెలవు.

Somasila: చెక్కిన శిల్పం.. ప్రకృతి అందాలు.. మనమూ చూసొద్దాం రండి

Somasila: తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక.. పర్యాటక రంగంలో ప్రపంచానికే తెలంగాణ తలమానికంగా నిలుస్తుంది. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన కట్టడాలు.. దేవతలు, ఆకుపచ్చని అరణ్యాలకు నెలవు. ఆకాశం నుంచి దుంకే జలపాతలు…ఒక్కటేంటి ఇక్కడి చెట్టు, చేమ, నీరు, రాయి ఇలా ప్రతీది దర్శించుకోవలసినవే. తెలంగాణ గడ్డ పర్యాటక ఆకర్షణలపై ఓ లుక్కేద్దాం.

ఉమ్మడి మహబూబ్ నగర్ వెళ్లారా? (Somasila)

తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక.. పర్యాటక రంగంలో ప్రపంచానికే తెలంగాణ తలమానికంగా నిలుస్తుంది. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన కట్టడాలు.. దేవతలు, ఆకుపచ్చని అరణ్యాలకు నెలవు. ఆకాశం నుంచి దుంకే జలపాతలు…ఒక్కటేంటి ఇక్కడి చెట్టు, చేమ, నీరు, రాయి ఇలా ప్రతీది దర్శించుకోవలసినవే. తెలంగాణ గడ్డ పర్యాటక ఆకర్షణలపై ఓ లుక్కేద్దాం. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా.. ప్రస్తుత నాగర్ కర్నూల్ జిల్లా పర్యాటక ప్రాంతానికి ప్రసిద్ధి.

ఈ జిల్లాలో ఎక్కాల్సిన కొండలు, మెుక్కాల్సిన గుడులు, చూడాల్సిన నిర్మాణాలు, సేదతీరాల్సిన విడిది కేంద్రాలు ప్రత్యేకం. ఇందులో ముఖ్యమైనది సోమశిల. ఇది ఓ కలల కల్యాణమండపమే. మీరు ఇప్పటిదాకా చూడలేదా. అయితే చూసొద్దాం పదండి.

ఈ జిల్లాకు నల్లమల ఓ వరం. ఈ అడవి పచ్చదనం, కృష్ణానది ప్రవాహం, ఆధ్యాత్మిక సౌరభం ఇలా కొల్లాపూర్‌ ప్రత్యేకతలు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాడ్డాక సోమశిల పర్యాటకంగా ఎంతో అభివృద్ధి చెందింది.
కృష్ణానదిపై ఐకానిక్‌ కేబుల్‌ బ్రిడ్జి పనులు త్వరలో ప్రారంభం కానున్నాయి. దీంతో సోమశిల టూరిజం జంక్షన్‌గా మారనుంది. ఓ వైపు సంగమేశ్వరాలయం, ఈవైపు సోమేశ్వరాలయం.. పుణ్యరాశిగా వెలిశాయి.
ఇక్కడి ప్రకృతి అందాలు పాపికొండలకు దీటుగా నిలుస్తాయి. దీంతో పర్యాటకులు సోమశిలకు బారులుకడుతున్నారు.
ఇక ఇక్కడి సోమశిలలో సోమశిలలో కాటేజీలు, లాంచీలు, హోటళ్లు ఏర్పాటుచేసింది.

పర్యాటకశాఖ నేతృత్వంలో సోమశిల నుంచి శ్రీశైలం వరకు సాగే లాంచీ యాత్ర మరపురాని అనుభూతి.

మార్గమధ్యలో ఆంకాళమ్మకోట, పక్కనే నది మధ్యలో వెలసిన ద్వీపంలో జాలర్ల నివాసాలు అబ్బురపరుస్తాయి.

కాకపోతే ఆ వైభోగాన్ని నీళ్లు అడుగంటేలోపే చూడాలి.

తెలంగాణలో సోమశిల-కొత్తపల్లి (నంద్యాల జిల్లా) మండలం సిద్ధేశ్వరం మధ్య రెండు కొండల నడుమ కృష్ణానదిపై 1.077 కిలోమీటర్ల ఐకాన్‌ కేబుల్‌ బ్రిడ్జి నిర్మించనున్నారు.

ఇది కనుక పూర్తయితే.. ఈ ప్రాంతానికి మరింత పర్యాటక శోభ ఖాయం!

 

సోమశిల టు శ్రీశైలం

హైద్రాబాద్‌ నుంచి సోమశిల వరకు బస్సులో, ఇక్కడినుంచి శ్రీశైలం వరకూ లాంచీలో ప్రయాణం.

శ్రీశైలంలో గదులు, రెండు పూటల భోజనం, తిరుగు లాంచీలో సోమశిలకు, అక్కడినుంచి గమ్యస్థానమైన హైద్రాబాద్‌కు.. ఈ ప్యాకేజీలో పెద్దలకు రూ.4,500 చార్జి చేస్తారు.

ఒకవైపు యాత్రకూ అవకాశం ఉంటుందని తెలంగాణ ఏకో టూరిజం లాంచీ నిర్వాహకుడు రాజేష్‌గౌడ్‌ చెప్పారు.

ప్రస్తుతం లాంచీ సోమశిల పరిసరాలకే పరిమితం. శ్రీశైలం ఆనకట్టకు వరద కొనసాగే సమయంలో మళ్లీ సోమశిల నుంచి మల్లన్న సన్నిధికి యాత్ర మొదలవుతుంది.