Last Updated:

Virat Kohli Fitness Band: ఛాంపియన్స్ ట్రోఫీ.. విరాట్ కోహ్లీ చేతికి ఉన్న ఈ బ్యాండ్ చూశారా..?

Virat Kohli Fitness Band: ఛాంపియన్స్ ట్రోఫీ.. విరాట్ కోహ్లీ చేతికి ఉన్న ఈ బ్యాండ్ చూశారా..?

Virat Kohli Fitness Band: ఛాంపియన్స్ ట్రోఫీలో పాకిస్థాన్‌తో జరిగిన హై ఓల్టేజ్ మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ సెంచరీ చేసిన సంగతి మనందరికి తెలిసిందే. ఈ సెంచరీతో కింగ్ సరికొత్త చరిత్రను సృష్టించాడు. భారత గెలుపులో కీలక పాత్ర పోషించాడు. అయితే ఈ మ్యాచ్ జరుగుతున్నప్పుడు కోహ్లీ తన చేతికి ఒక బ్యాండ్ ధరించి ఉన్నాడు. ఇలా కోహ్లీ బ్యాండ్‌తో కనిపించడం ఇదేమి మొదటిసారి కాదు. కానీ కొన్ని ప్రత్యేక సందర్భాలో వీటి గురించి కూడా మాట్లాడుకోవాల్సి ఉంటుంది.

నిజానికి, ఇది ఒక ఫిట్‌నెస్ బ్యాండ్. దీని ప్రత్యేకత ఏమిటంటే ఇందులో స్క్రీన్ ఉండదు. ఈ బ్యాండ్ కంపెనీ అమెరికాకు చెందినది. ఈ కంపెనీ పేరు వూప్. విరాట్ కోహ్లీ మాత్రమే కాదు, ప్రపంచంలోని చాలా మంది క్రీడాకారులు ఈ బ్యాండ్ ధరిస్తారు. వీరిలో క్రిస్టియానో​​రొనాల్డో కూడా ఉన్నారు. వాస్తావానికి ఇదొక ఫిట్‌నెస్ బ్యాండ్. దీనిలో ఒక ప్రత్యేకమైన ఫీచర్ ఉంది. అదేంటంటే ఈ బ్యాండ్‌కి స్క్రీన్ ఉండదు. ఈ బ్యాండ్‌ను అమెరికాకు చెందిన వూప్ తయారు చేసింది. విరాటో కోహ్లానే కాదు, గాడ్ ఆఫ్ ఫుట్‌బాల్ క్రిస్టియానో రొనాల్డో కూడా ఈ బ్యాండ్‌ను ఉపయోగిస్తారు.

వూప్ కంపెనీకి చాలా పెద్ద చరిత్రే ఉంది. దీనిని 2012లో విల్ అహ్మద్ స్థాపించారు. అంటే ఇప్పటికీ 13 ఏళ్లు అవుతుంది. వూఫ్ ప్రధాన కార్యాలయం బోస్టన్‌లో ఉంది. కంపెనీ మొదటి ప్రొడక్ట్ WHOOP 1.0. దీనిని 2015 సంవత్సరంలో లాంచ్ చేశారు. ఈ బ్యాండ్‌‌లో చాలా వెర్షన్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. అంతే కాకుండా కంపెనీ 2023 సంవత్సరంలో కంపెనీ OpenAI ‘హూప్ కోచ్’ ఫీచర్‌‌తో అప్‌గ్రేడ్ చేసి విడుదల చేసింది.

ఈ బ్యాండ్ పనితీరు విషయానికి వస్తే.. ఇది ఫిట్‌నెస్‌ ట్రాకింగ్, స్టెప్స్ కౌంట్, హార్ట్ బీట్ రేటు, కేలరీల కౌంట్, స్లిప్ క్వాలిటీ మొదలైన వాటిని పర్యవేక్షిస్తుంది. అంతేకాకుండా శరీరంలో జరిగే మార్పులపై కూడా దృష్టిపెడుతుంది. అంతేకాదు ఆహారం నుండి నిద్ర, మేలుకోవడం వరకు ప్రతి వివరాలను అందిస్తుంది. ఈ డేటా అంతా మనిషి తనను తాను ఫిట్‌గా ఉంచుకోవడానికి సహాయపడుతుంది. బ్యాండ్‌‌కి స్క్రీన్ ఉండదు. దీని కారణంగా ప్రత్యేక శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఉండదు. బ్యాండ్ నిశ్శబ్ధంగా తన పని తాను చేసుకుంటుంది.

బ్యాండ్‌ను స్మార్ట్‌ఫోన్‌కి కనెక్ట్ చేయచ్చు, మీ ఆరోగ్య సమచారాన్ని మొత్తం యాప్ ద్వారా ఫోన్‌లో చూడచ్చు. విరాట్ కోహ్లీ 2023లో మొదటి సారిగా ఈ ఫిట్నెస్ బ్యాండ్ ధరించి కనిపించాడు. ఈ కామర్స్ వెబ్‌సైట్ ఫ్లిప్‌కార్ట్ నుంచి దీన్ని కొనుగోలు చేయచ్చు. WHOOP 4.0 వెర్షన్ ఒక సంవత్సరం సబ్‌స్క్రిప్షన్ ధర రూ.26,990గా ఉంది. దీనిపై కంపెనీ జీవితకాల వారంటీని ఇస్తుంది.