Google Pixel 10 Series: పిచ్చోళ్లైపోతారు.. పిక్సెల్ 10 సిరీస్ ఫోన్లు వస్తున్నాయ్.. అబ్బబ్బ మోడళ్లు అల్లాడించేశాయ్..!

Google Pixel 10 Series: గూగుల్ మరోసారి తన కొత్త స్మార్ట్‌ఫోన్ విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తుంది. ఈసారి పిక్సెల్ 10 సిరీస్‌తో సంచలనాలు సృష్టించనుంది. టెక్ ఇండస్ట్రీ సమాచారం ప్రకారం.. కంపెనీ తన మునుపటి ఫార్ములాను కొనసాగిస్తూ నాలుగు కొత్త మోడళ్లను విడుదల చేస్తుంది. ప్రత్యేకత ఏమిటంటే వీటిలో కొన్ని ఫోన్ల ధరల్లో ఎటువంటి మార్పు ఉండదు. ఫోల్డ్‌బుల్ ఫోన్‌ను చౌక ధరకే విడుదల చేయచ్చు. కొన్ని మోడళ్ల ధరలు స్వల్పంగా పెరగచ్చు. మీరు కూడా గూగుల్ పిక్సెల్ ఫోన్ అభిమాని అయితే ఈ వార్త మీకు చాలా ఆసక్తికరంగా ఉంటుంది. రండి ఆ వివరాలను తెలుసుకుందాం.
Google Pixel 10 Series Launch Plan Revealed
గూగుల్ రాబోయే పిక్సెల్ 10 సిరీస్‌కు సంబంధించిన కొత్త నివేదిక వెలువడింది, ఇది అన్ని మోడళ్ల ధరలను వెల్లడిస్తుంది. నివేదిక ప్రకారం.. గూగుల్ ఈ సంవత్సరం కూడా దాని మునుపటి ఫార్ములాను కొనసాగిస్తుంది. నాలుగు కొత్త పిక్సెల్ స్మార్ట్‌ఫోన్‌లను విడుదల చేస్తుంది – ఒక A-సిరీస్ మోడల్ (పిక్సెల్ 10a), ఒక బేస్ మోడల్ (పిక్సెల్ 10), రెండు ప్రో మోడల్‌లు (పిక్సెల్ 10 ప్రో, పిక్సెల్ 10 ప్రో XL), ఒక ఫోల్డబుల్ ఫోన్ (పిక్సెల్ 10 ప్రో ఫోల్డ్). లీకైన రెండర్‌ల ప్రకారం.. ఈ ఫోన్‌ల డిజైన్‌లో పెద్ద మార్పులు ఉండవు. కెమెరా స్పెసిఫికేషన్లు కూడా ఇటీవల లీక్ అయ్యాయి.
Google Pixel 10 Pro Fold Is Now Cheaper
అతి ముఖ్యమైన విషయం ఏమిటంటే ఈ సంవత్సరం పిక్సెల్ 10 ప్రో ఫోల్డ్ ధర తగ్గువగా ఉంటుంది. నివేదికల ప్రకారం.. ఈ ఫోన్‌ను దాదాపు $1,600 (సుమారు రూ. 1,33,000) కు లాంచ్ చేయచ్చు, ఇది గత సంవత్సరం పిక్సెల్ 9 ప్రో ఫోల్డ్ కంటే $200 తక్కువ. అదే సమయంలో 2027 నాటికి పిక్సెల్ 12 ప్రో ఫోల్డ్ ధర $1,500కి తగ్గవచ్చని భవిష్యత్ ప్రణాళికలో కూడా చెప్పింది. గూగుల్ ఈ వ్యూహాత్మక చర్య ఫోల్డబుల్ ఫోన్‌లను ఎక్కువ మందికి అందుబాటులోకి తీసుకురావడానికి ఒక ప్రయత్నంగా భావిస్తున్నారు.
The Prices Of The Pixel 10 And Pro Models Will Be Almost The Same
మిగిలిన పిక్సెల్ 10 సిరీస్ విషయానికొస్తే.. పిక్సెల్ 10, పిక్సెల్ 10 ప్రో ధరలు పిక్సెల్ 9, పిక్సెల్ 9 ప్రో ధరల మాదిరిగానే ఉంటాయి. అంటే Pixel 10 ధర $799 (సుమారు రూ. 66,000), పిక్సెల్ 10 ప్రో ధర $999 (సుమారు రూ. 82,000) కావచ్చు. అయితే పిక్సెల్ 10 ప్రో XL ధర $100 పెరుగుతుంది. దీని ధర $1,199 (సుమారు రూ. 98,000) కు చేరుకుంటుంది. ఈ మార్పు బేస్, ప్రో మోడల్‌ల మధ్య వ్యత్యాసాన్ని మరింత స్పష్టంగా చూపుతుంది.
Pixel 10a And future Plans Also Decided
పిక్సెల్ A-సిరీస్ గురించి శుభవార్త ఉంది. నివేదిక ప్రకారం.. కొత్త పిక్సెల్ 10a ఫోన్ ధర దాదాపు $499 (అంటే సుమారు రూ.41,000) గా ఉంటుంది. మంచి విషయం ఏమిటంటే.. 2027 లో వచ్చే పిక్సెల్ 12a వరకు గూగుల్ ఈ ధరను కొనసాగించబోతోంది. గూగుల్ ప్రతి సంవత్సరం ఆగస్టులో తన కొత్త పిక్సెల్ సిరీస్‌ను ప్రారంభిస్తుంది, కాబట్టి పిక్సెల్ 10 సిరీస్ కూడా ఆగస్టు 2025 లో విడుదల చేయవచ్చని భావిస్తున్నారు. మార్కెట్లోని ఇతర కంపెనీలతో పోటీ పడటానికి గూగుల్ తన ఫోన్‌ల లాంచ్ తేదీ, ధరను రాబోయే కొన్ని సంవత్సరాలు అలాగే ఉంచాలని యోచిస్తోందని ఈ నివేదిక స్పష్టం చేస్తుంది.
ఇవి కూడా చదవండి:
- Discount on Realme Narzo 80x 5G: రియల్‌మి కొత్త ఫోన్.. ఏప్రిల్ 11న సేల్.. సరికొత్త ఆఫర్లు ఇచ్చేసింది..!