Last Updated:

Smartphones Under 10K: 10 వేల బడ్జెట్‌లో ఏ స్మార్ట్‌‌ఫోన్ కొనాలి? ఫీచర్స్, కెమెరా అదిరిపోయింది.. ఈ ఐదు ఫోన్లపై ఓ లుక్కేయండి..!

Smartphones Under 10K: 10 వేల బడ్జెట్‌లో ఏ స్మార్ట్‌‌ఫోన్ కొనాలి? ఫీచర్స్, కెమెరా అదిరిపోయింది.. ఈ ఐదు ఫోన్లపై ఓ లుక్కేయండి..!

Smartphones Under 10K:ప్రస్తుతం భారతీయ స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో చాలా స్మార్ట్‌ఫోన్‌లు అందుబాటులో ఉన్నాయి. కస్టమర్లను ఆకర్షించడానికి, స్మార్ట్‌ఫోన్ కంపెనీలు ప్రతి ధర విభాగంలో కొత్త స్మార్ట్‌ఫోన్‌లను విడుదల చేస్తూనే ఉన్నాయి. కంపెనీలు తక్కువ ధరకు కస్టమర్లకు అద్భుతమైన పనితీరు, గొప్ప ఫీచర్లతో స్మార్ట్‌ఫోన్‌లను అందిస్తున్నాయి.మీరు కూడా కొత్త స్మార్ట్‌ఫోన్‌ రూ. 10,000 బడ్జెట్‌లో కొనాలని చూస్తుంటే.. మీ ముందు చాలానే ఎంపికలు ఉన్నాయి. ఈ స్మార్ట్‌ఫోన్‌ల ధర, ఫీచర్స్ తదితర వివరాలు తెలుసుకుందాం.

Itel Colour Pro 5G
రూ. 8,216 నుండి ప్రారంభమయ్యే Itel Color Pro 5G స్మార్ట్‌ఫోన్‌లో మీడియాటెక్ డైమెన్సిటీ 6080 ప్రాసెసర్ ఉంది. ఫోన్ 6GB RAMతో వస్తుంది. అలానే 6.6 అంగుళాల HD + IPS LCD డిస్‌ప్లే ఉంది, దీని రిఫ్రెష్ రేట్ 90Hz. కెమెరా సెటప్ విషయానికి వస్తే.. ఫోన్‌లో 50-మెగాపిక్సెల్ డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది, ముందువైపు 8-మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఉంది. దీనితో పాటు, ఈ ఐటెల్ ఫోన్‌లో 5000mAh బ్యాటరీని అందించింది. ఇది ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ ఇస్తుంది.

Infinix Hot 50 5G
రూ. 9,499 నుండి ప్రారంభమయ్యే ఈ Infinix ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 6300 ప్రాసెసర్‌తో 4GB RAMని కలిగి ఉంది. ఈ ఫోన్ డిస్‌ప్లే 6.7 అంగుళాలు, ఇది HD + IPS LCD ప్యానెల్. దీని రిఫ్రెష్ రేట్ 120Hz. ఫోటోగ్రఫీ గురించి చెప్పాలంటే, ఫోన్‌లో 48 MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఈ ఫోన్ సెల్ఫీ, వీడియో కాలింగ్ కోసం 8 MP ఫ్రంట్ కెమెరాను ఉంది. పవర్ కోసం ఫోన్‌లో 5000mAh బ్యాటరీ ఉంది.

Infinix Smart 9 HD
రూ. 6,699 నుండి ప్రారంభమయ్యే Infinix నుండి మరో ఫోన్ పది వేల రూపాయల బడ్జెట్‌తో స్మార్ట్‌ఫోన్‌ల జాబితాలో ఉంది. ఈ ఫోన్‌లో మీడియాటెక్ Helio G50 ప్రాసెసర్, 3GB RAM ఉంది. ఫోన్‌లో 6.7 అంగుళాల HD + IPS LCD డిస్‌ప్లే ఉంది, దీని రిఫ్రెష్ రేట్ 90Hz. ఈ ఫోన్‌లో 13 మెగాపిక్సెల్ డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ముందు భాగంలో 8 మెగాపిక్సెల్ కెమెరా అందించారు. బ్యాటరీ గురించి చెప్పాలంటే, దీని కెపాసిటీ 5000mAh.

Xiaomi Redmi 14C
రూ. 9,999 నుండి Redmi 14C క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 4 జెన్ 2 ప్రాసెసర్‌ను కలిగి ఉంది, ఇది 4GB RAMతో వస్తుంది. ఈ రెడ్మీ ఫోన్‌లో 6.88 అంగుళాల HD+ IPS LCD డిస్‌ప్లే ఉంది, దీని రిఫ్రెష్ రేట్ 120Hz. ఈ Redmi ఫోన్‌లో 50 MP డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ముందు భాగంలో 8 MP సెల్ఫీ కెమెరా అందించారు. ఈ  బడ్జెట్ స్మార్ట్‌ఫోన్‌లో 5160mAh బ్యాటరీ ఉంది, ఇది ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపొర్ట్ ఇస్తుంది.

Realme Narzo N63
రూ. 8,499 నుండి ప్రారంభమయ్యే రియల్‌మీ నార్జో N63 స్మార్ట్‌ఫోన్‌లో 4GB RAM. Unisoc T612 ప్రాసెసర్ ఉంది. ఈ ఫోన్‌లో 6.74 అంగుళాల HD+ IPS LCD డిస్‌ప్లే ఉంది, దీని రిఫ్రెష్ రేట్ 90Hz. ఈ ఫోన్‌లో 50 MP డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ కూడా ఉంది. సెల్ఫీ, వీడియో కాలింగ్ కోసం ఫోన్‌లో 8 MP ఫ్రంట్ కెమెరా ఉంది. Realme ఈ ఫోన్‌లో 5000mAh బ్యాటరీ, సూపర్ VOOC ఛార్జింగ్ సపోర్ట్ ఇస్తుంది.