Home / YS Sharmila Arrest
ఏపీ సీఎం జగన్ సోదరి షర్మిలకు ప్రధాని నరేంద్ర మోదీ ఫోన్ చేసినట్లు సమాచారం అందుతుంది. తెలంగాణ రాష్ట్రంలో వైఎస్సార్టీపీ పార్టీని స్థాపించి తనదైన శైలిలో దూసుకుపోతున్నారు వైఎస్ షర్మిల. కాగా ఇటీవల షర్మిలను అరెస్టు చేసిన విషయం అందరికీ తెలిసిందే.
ప్రగతిభవన్ వద్ద హైడ్రామా నెలకొంది. వైఎస్సార్టీపీ అధినేత్రి షర్మిలను పోలీసులు అరెస్ట్ చేశారు. నిన్న షర్మిల కాన్వాయ్ పై తెరాస కార్యకర్తలు దాడి చేసిన సంగతి తెలిసిందే. కాగా ఆ ధ్వంసమైన కారులో భారీ కాన్వాయ్‌తో నేడు ప్రగతిభవన్ ముట్టడికి షర్మిల యత్నించారు. దానితో వెంటనే అప్రమత్తమైన పోలీసులు సోమాజిగూడ వద్ద షర్మిలను అడ్డుకుని అరెస్ట్ చేశారు.
వైఎస్‌ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల ను అరెస్ట్ చేశారు. వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలం లింగగిరి వద్ద షర్మిలను అరెస్ట్ చేశారు.