Home / Yashwant Sinha
రాష్ట్రపతి ఎన్నికల ఓట్ల లెక్కింపు తొలి రౌండ్ లో మొత్తం 748 మంది పార్లమెంటు సభ్యుల ఓట్లను అధికారులు లెక్కించారు. ఈ ఓట్ల విలువ 5,23,600. ఇందులో 3,78,000 విలువైన 540 ఓట్లను ఎన్డీఏ అభ్యర్థి ద్రౌపది ముర్ముకి లభించాయి. విపక్షాల ఉమ్మడి అభ్యర్థి యశ్వంత్ సిన్హాకు 1,45,600 విలువైన 208 ఓట్లు వచ్చాయి.
దేశానికి 15వ రాష్ట్రపతి ఎవరవుతారో మరికొన్ని గంటల్లో తేలిపోనుంది. రాష్ట్రపతి ఎన్నికలో ఓట్ల లెక్కింపు కోసం అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. పార్లమెంట్ హౌస్‌లోని 63వ నంబర్ గదిలో ఉదయం 11 గంటలకు లెక్కింపు ప్రారంభం కానుంది. అన్ని రాష్ట్రాల నుంచి బ్యాలెట్ బాక్సులను ఇప్పటికే పార్లమెంట్
భారత 15వ రాష్ట్రపతి ఎన్నికల పోలింగ్ ముగిసింది. ఎన్డీఏ అభ్యర్థిగా ద్రౌపది ముర్ము, ప్రతిపక్షాల అభ్యర్థిగా యశ్వంత్ సిన్హా పోటీలో నిలబడ్డారు. ఎన్నికల రిటర్నింగ్ అధికారి అయిన రాజ్యసభ సెక్రెటరీ జనరల్ ఆధ్వర్యంలో ఈ నెల 21న పార్లమెంటులో ఓట్ల లెక్కింపు జరుగుతుంది. అదే రోజు రాత్రి ఫలితాలను
భారతదేశ 15వ రాష్ట్రపతిని ఎన్నుకునేందుకు సర్వం సిద్ధమైంది. కాసేపట్లో రాష్ట్రపతి పదవికి ఎన్నికలు జరగనున్నాయి. పార్లమెంట్, రాష్ట్ర అసెంబ్లీ, అసెంబ్లీ ఉన్న కేంద్రపాలిత ప్రాంతాల్లోనూ పోలింగ్ జరగనుంది. పార్లమెంటులో లోక్ సభ, రాజ్యసభ సభ్యులు మొత్తం 776 మంది