Home / Y. S. Vivekananda Reddy
మాజీ మంత్రి వైఎస్ వివేకానంద హత్య కేసు విచారణ తెలంగాణకు బదిలీ చేసింది సుప్రీంకోర్టు. హైదరాబాద్ సీబీఐ కోర్టుకు బదిలీ చేస్తూ సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. వివేకా భార్య, కుమార్తెకు విచారణపై అసంతృప్తి ఉందని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది.
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఇప్పటికే వైసీపీ సర్కార్ ఒత్తిడి నేపథ్యంలో సీబీఐ దర్యాప్తు ఆలస్యమవుతుందని భావిస్తున్న నేపథ్యంలో ఈ పరిణామం కేసును మరో మలుపు తిప్పేలా కనిపిస్తోంది.