Home / wrestlers
రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (డబ్ల్యూఎఫ్ఐ) మాజీ అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ రెజ్లర్లను బెదిరించారని, వారిని మౌనంగా ఉండమని కోరారని, ఈ కేసుపై విచారణ సందర్భంగా ఢిల్లీ పోలీసులు రూస్ అవెన్యూ కోర్టుకు తెలిపారు. బ్రిజ్ భూషణ్ పై అభియోగాలు మోపాలా వద్దా అనే దానిపై కొత్తగా వాదనలు ప్రారంభమవడంతో ఢిల్లీ పోలీసులు గురువారం ఈ విషయాన్ని కోర్టు దృష్టికి తీసుకు వచ్చారు.
న్యూఢిల్లీలో నిరసన తెలిపిన రెజ్లర్లపై ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ (ఎఫ్ఐఆర్) దాఖలు చేయాలని అభ్యర్థనకు సంబంధించి ఢిల్లీ పోలీసులు యాక్షన్ టేక్ రిపోర్ట్ (ఎటిఆర్)ని కోర్టుకు సమర్పించారు.రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (డబ్ల్యూఎఫ్ఐ) అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌పై తప్పుడు ఆరోపణలు చేశారని, విద్వేషపూరిత ప్రసంగానికి పాల్పడ్డారని పిటిషన్లో ఆరోపించారు.
కేంద్ర క్రీడల మంత్రి అనురాగ్ ఠాకూర్ బుధవారం న్యూ ఢిల్లీలోని తన నివాసంలో రెజ్లర్లతో సమావేశమైన తర్వాత రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఎన్నికలను జూన్ 30 లోపు నిర్వహిస్తామని రెజ్లర్లకు హామీ ఇచ్చారు. బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలపై పోలీసు విచారణ జూన్ 15 నాటికి పూర్తవుతుందని, దర్యాప్తు స్థితి గురించి రెజ్లర్లకు తెలియజేస్తామని వారికి చెప్పారు.
భారత అగ్రశ్రేణి రెజ్లర్ల ప్రతినిధి బృందం శనివారం హోంమంత్రి అమిత్ షాతో రాజధానిలోని ఆయన అధికారిక నివాసంలో సమావేశమైంది.రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (డబ్ల్యూఎఫ్ఐ) చీఫ్ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌పై తమ నిరసన గురించి మాట్లాడేందుకు ఒలింపిక్స్‌లో పాల్గొన్న రెజ్లర్లు బజరంగ్ పునియా, సాక్షి మాలిక్ మరియు వినేష్ ఫోగట్ హోం మంత్రి అమిత్ షాను ఆయన నివాసంలో కలిశారు
భారత రెజ్లింగ్ సమాఖ్య మాజీ చీఫ్ బ్రిజ్‌భూషణ్ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్న రెజ్లర్లకు న్యాయం జరగాలని అందరూ కోరుకుంటున్నట్లు కేంద్ర క్రీడలశాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ చెప్పారు. అయితే, న్యాయ ప్రక్రియను అనుసరించి మాత్రమే అది సాధ్యమవుతుందన్నారు. నిష్పక్షపాత దర్యాప్తు జరగాలని కేంద్రం కోరుకుంటోంది.
రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (డబ్ల్యూఎఫ్ఐ) చీఫ్ మరియు బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌పై రెజ్లర్లు లైంగిక వేధింపుల ఆరోపణల ఆధారంగా ఢిల్లీ పోలీసులు రెండు ఎఫ్ఐఆర్లు మరియు 10 ఫిర్యాదులు దాఖలు చేశారు.
కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా రెజ్లర్లు తమ పతకాలను గంగలో నిమజ్జనం చేసేందుకు మంగళవారం హరిద్వార్ చేరుకున్నారు. సమస్య పరిష్కారానికి ఐదు రోజుల సమయం కావాలని రైతు నాయకులు కోరడంతో పథకం విరమించుకున్నారు.
ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నిరసన వ్యక్తం చేస్తున్న రెజ్లర్లను అక్కడనుంచి పంపించిన నేపధ్యంలో వారు మంగళవారం తమ మెడల్స్ ను హరిద్వార్ లోని గంగానదిలో నిమజ్జనం చేస్తామని తెలిపారు. ట్విట్టర్ లో పోస్టు చేసిన ఈ ప్రకటనలో పతకాలను నిమజ్జనం చేసిన తరువాత ఇండియా గేట్ వద్ద నిరవధిక నిరాహారదీక్షకు కూర్చుటుంటామని తెలిపారు.
న్యూఢిల్లీలో రెజ్లర్ల నిరసన సందర్భంగా కేంద్రం వ్యవహరించిన తీరుపై భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు మండిపడ్డారు.ఈ విధంగా ఎందుకు ఉండాలో భారత ప్రభుత్వం నుండి బాధ్యతాయుతమైన నాయకులెవరైనా మాకు చెప్పగలరా? అని కేటీఆర్ ట్విట్టర్లో కేంద్రాన్ని ప్రశ్నించారు.
ఆదివారం జంతర్ మంతర్ వద్ద జరిగిన ఘర్షణకు సంబంధించి ఢిల్లీ పోలీసులు నిరసన నిర్వాహకులు మరియు ఇతరులపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. రెజ్లర్లు బజరంగ్ పునియా, సాక్షి మాలిక్, వినేష్ ఫోగట్ మరియు నిరసన నిర్వాహకులపై కేసు నమోదు చేయబడింది.