Home / Vande Bharat trains
Vande Bharat trains: రైల్వే శాఖ దక్షిణ భారతదేశంలో మరో మూడు వందే భారత్ రైళ్లను ప్రవేశపెట్టే అవకాశం ఉందని అధికారులుతెలిపారు. కాచిగూడ -బెంగళూరు, సికింద్రాబాద్ -తిరుపతి, సికింద్రాబాద్ -పూణే మధ్య ఈ వందేభారత్ రైళ్లు తిరుగుతాయని వారు అన్నారు. మొట్టమొదటి వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు ప్రారంభించిన ప్రధాని మోదీ ఈ ఏడాది నవంబర్‌లో చెన్నై-బెంగళూరు-మైసూర్ మార్గంలో దక్షిణ భారతదేశపు మొట్టమొదటి వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలును ప్రారంభించారు. బెంగళూరులోని క్రాంతివీర సంగొల్లి రైల్వే స్టేషన్‌లో […]
రాబోయే కేంద్ర బడ్జెట్‌లో సుమారు 300 నుండి 400 కొత్త వందే భారత్ రైళ్లను ప్రకటించవచ్చని మంత్రిత్వ శాఖ వర్గాలు తెలిపాయి. రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ 2024 మొదటి త్రైమాసికంలో స్లీపర్ కోచ్‌లతో కూడిన మొదటి వందే భారత్ రైలును విడుదల చేయనున్నట్లు చెప్పారు.
వచ్చే ఏడాది ఆగస్టు 15 నాటికి 75 కొత్త వందేభారత్ రైళ్లను నడపాలని భారతీయ రైల్వే లక్ష్యంగా పెట్టుకుంది. అందువల్ల ప్రతినెలా ఏడెనిమిది రైళ్లు సిద్ధంగా ఉండాలన్నది రైల్వే లక్ష్యం కావడంతో ఈ రైళ్ల నిర్మాణాన్ని వేగవంతం చేశారు.