Home / TS news
తెలంగాణ ప్రభుత్వం నేడు శాసన సభలో ఎనిమిది బిల్లులను సభలో ప్రవేశపెట్టగా, సభ ఆమోదం తెలిపింది.
అక్టోబర్ 5 న దసరా పండుగను పురస్కరించుకొని తెలంగాణ ప్రభుత్వం విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించింది. ఈ నెల26వ తేదీ నుంచి అక్టోబర్ 8వ తేదీ వరకు మొత్తం 13 రోజులు దసరా సెలవులుగా వెల్లడించింది.
భాగ్యనగరంలోని పబ్స్ నిర్వహణ పై తెలంగాణ హైకోర్టు కీలక ఉత్తర్వులు ఇచ్చింది. రాత్రి 10గంటల నుండి ఉదయం 6గంటలకు ఎలాంటి డిజేలు ఉండకూడదని మద్యంతర ఆదేశాలు జారీ చేసింది.
ఇండియాన్ ఫారెస్ట్ సర్వీస్ విభాగానికి సంబంధించి 17మంది ఐఎఫ్ఎస్ లను తెలంగాణ ప్రభుత్వం బదిలీ చేసింది
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు నేడు ప్రారంభం అయ్యాయి. ఐదురోజుల విరామం తర్వాత ఇవాళ తిరిగి ఉభయసభలు ప్రారంభం అయ్యాయి. ముందుగా దివంగత మాజీ ఎమ్మెల్యే భీమపాక భూపతిరావు మృతికి సభలో సంతాపం తెలిపారు.
వికారాబాద్ మెడిక్యూర్ ఆసుపత్రిలో వైద్యం వికటించి బాలింత మృతి చెందింది. వైద్యుల నిర్లక్ష్యంతోనే బాలింత మృతి చెందినట్లు మృతురాలి కుటుంబ సభ్యులు ఆరోపిస్తూ ఆసుపత్రి యాజమాన్యంపై దాడికి పాల్పడ్డారు.
తెలంగాణ రాష్ట్రంలో ఉప ఎన్నిక అంటేనే ఓటుకు భారీ డిమాండ్ ఉందనేది అందరికీ తెలిసిన విషయమే. అన్ని రాజకీయ పార్టీలకు ప్రతి ఓటు కీలకమే కావడంతో కొత్త ఓటర్ల నమోదుకు ప్రక్రియ మునుగోడు నియోజకవర్గంలో ఊపందుకుంది.
తెలుగు రాష్ట్రాల్లో గత కొద్దిరోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. కొన్ని ప్రాంతాల్లో ఈదురుగాలులు మరికొన్ని ప్రాంతాల్లో పిడుగులుపడ్డాయి. కాగా పెద్దపల్లి జిల్లాలో పిడుగుపాటుకు 9 మూగజీవాలు మృతి చెందాయి.
రాష్ట్రంలో గత కొన్ని రోజులుగా ఎడతెరిలేని వానలు కురుస్తున్నాయి. కాగా చెరువులు, వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. నాగార్జున సాగర్ ప్రాజెక్టులోకి వరద నీటి ఉద్ధృతి కొనసాగుతుంది. ఎగువ నుంచి వస్తోన్న వరదనీటి ప్రవాహాన్ని తాళలేక సాగర్ ఎడమ కాలువకు గండి పడింది.
తాను ఇచ్చిన హోమ్ వర్క్ చేయలేదని ఆగ్రహంతో ఒక ఉపాధ్యాయురాలు రెండో తరగతి చదువుతున్న బాలికపై తన ప్రతాపం చూపెట్టింది. ఆమె విచక్షణారహితంగా కొట్టిన దెబ్బలకు ఆ చిన్నారి ఆసుపత్రి పాలైంది. చికిత్స పొందుతూ సోమవారం కన్నుమూసింది.