Home / TS news
ఇకపై తెలంగాణాలో ప్రభుత్వ మెడికల్ స్టోర్స్ రానున్నాయి. ప్రభుత్వ వైద్యశాలల్లో ప్రజలకు మందులను సత్వరంగా అందచేసేందుకు వైద్య ఆరోగ్య శాఖ తెలంగాణ వ్యాప్తంగా 12 స్టోర్లను ఏర్పాటు చేసేందుకు ఉత్తర్వులు జారీ చేసింది.
ఓట్ల కోసం జూటా మాట్లాడే పార్టీల మాటలు నమ్మొద్దని మంత్రి హరీష్ రావు కోరారు. సిద్దిపేట జిల్లా కొండపాక మండలం ఖమ్మంపల్లి గ్రామంలో 3 కోట్ల 77లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన 60 డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను మంగళవారం ఆయన ప్రారంభించారు.
జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో శనివారం తెలంగాణ జాతీయ సమైక్యతా దినోత్సవంలో భాగంగా ఏర్పాటు చేసిన వేడుకలో జాతీయ జెండా తిరగబడింది. రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు అనురాగ్ శర్మ గౌరవ వందనం స్వీకరించి అనంతరం జాతీయ జెండాను ఎగురవేయగా తలక్రిందులుగా ఎగిరింది.
తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవ వేడుకల్లో భాగంగా సీఎం కేసీఆర్ నాంపల్లిలోని పబ్లిక్ గార్డెన్స్‌లో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం పౌలీసుల గౌరవ వందనం స్వీకరించి, ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు.
తెలంగాణ రాష్ట్ర విమోచన దినోత్సవాని పురస్కరించుకుని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సూచన మేరకు గాంధీ భవన్ లో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కళాకారుడు రాజు తెలంగాణ తల్లి విగ్రహనికి తుదిమెరుగులు దిద్దుతున్నాడు.
కోట్ల రూపాయలను వెచ్చించి నూతనంగా నిర్మిస్తున్న తెలంగాణ సచివాలయానికి రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేడ్కర్ పేరు పెట్టాలని ముఖ్యమంత్రి కల్వకుంట చంద్రశేఖర్ రావు కీలక నిర్ణయం తీసుకొన్నారు. ఈ మేరకు ఆయన ముఖ్య కార్యదర్శి సోమేష్ కుమార్ కు ఆదేశాలు జారీ చేసారు
నిజాం ఇన్సిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (నిమ్స్) డైరెక్టర్ గా డాక్టర్ ఎస్. రామ్మూర్తికి అదనపు బాధ్యతలు అప్పగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
ములుగు జిల్లా కేంద్రాన్ని మున్సిపాలిటీగా ఏర్పాటు చేసినందుకు ముఖ్యమంత్రి కల్వకుంట చంద్రశేఖర్‌రావు, మున్సిపల్ శాఖ మంత్రి రామారావులకు ఎమ్మెల్యే సీతక్క ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
తెలంగాణ ప్రభుత్వం నేడు శాసన సభలో ఎనిమిది బిల్లులను సభలో ప్రవేశపెట్టగా, సభ ఆమోదం తెలిపింది.
అక్టోబర్ 5 న దసరా పండుగను పురస్కరించుకొని తెలంగాణ ప్రభుత్వం విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించింది. ఈ నెల26వ తేదీ నుంచి అక్టోబర్ 8వ తేదీ వరకు మొత్తం 13 రోజులు దసరా సెలవులుగా వెల్లడించింది.