Home / TS news
తెలంగాణ శాసనసభ, మండలి సమావేశాలు కాసేపట్లో ప్రారంభం కానున్నాయి. శాసనసభ ఎనిమిదో సెషన్‌కు సంబంధించి మూడో సమావేశం ప్రారంభం కానుంది. మండలి 18వ సెషన్‌కు సంబంధించిన మూడో సమావేశం ప్రారంభం కానుంది. సమావేశాల నిర్వహణ కోసం ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేశారు.
సీఎం కేసీఆర్ నేడు నిజామాబాద్ జిల్లాలో పర్యటిస్తారు. నేటి మధ్యాహ్నం 2 గంటలకు సీఎం హెలిక్యాప్టర్ లో జిల్లాకు చేరుకుంటారు. కొత్త కలెక్టరేట్ తో పాటు పార్టీకార్యాలయాన్ని ప్రారంభిస్తారు. అనంతరం 3 గంటలకు ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం ప్రసంగిస్తారు.
ఈ నెల 5 నుంచి తెలంగాణవ్యాప్తంగా ఉచిత చేప పిల్లలు, రొయ్య పిల్లలను పంపిణీ చేయనున్నామని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. వచ్చే సోమవారం కార్యక్రమాన్ని ప్రాంభించనున్న నేపథ్యంలో అన్ని జిల్లాల మత్స్య శాఖ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
షేక్‌పేట మాజీ ఎమ్మార్వో సుజాత అనుమానాస్పద స్థితిలో మృతిచెందారు. ఆదాయానికి మించి ఆస్తుల కేసులో సుజాత గతంలో అరెస్ట్ అయిన సుజాత జైల్లో ఉండగానే ఆమె భర్త ఆత్మహత్య చేసుకున్నాడు. తీవ్ర మానసిక క్షోభతో బాధపడుతున్న సుజాత ఆత్మహత్యకు పాల్పడినట్లు ప్రచారం జరిగింది.
తెలంగాణ పదో తరగతి అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయి. ఉదయం 11.30 గంటలకు పాఠశాల విద్యాశాఖ సంచాలకురాలు శ్రీదేవసేన ఫలితాలను విడుదల చేశారు. ఫలితాలు www.bse.telangana.gov.in వెబ్సైట్లో అందుబాటులో ఉన్నాయి.
తెలంగాణ ప్రభుత్వం కుటుంబ నియంత్రణ శస్త్రచికిత్సల కాన్పులను తాత్కాలికంగా నిలిపివేయాలని నిర్ణయించింది. కుటుంబ నియంత్రణ ఆపరేషన్ల నిబంధనల్లో ప్రభుత్వం మార్పులు చేసింది. రోజుకు 10 నుంచి 15 ఆపరేషన్లు మాత్రమే చేసేలా కొత్త నిబంధన విధించింది.
కొద్ది రోజులుగా అంతర్గత కలహాలతో తీవ్ర ఇబ్బందులు పడ్డ తెలంగాణ కాంగ్రెస్ అగ్రనేతలు సైలెంట్మ అయిపోయారు. ఇప్పటికే మునుగోడు విషయంలో టీఆరెస్, బీజేపీలు విజయమే లక్ష్యంగా దూకుడుగా వెళ్తుంటే కాంగ్రెస్
తెలంగాణ ప్రభుత్వానికి కేంద్రం షాక్ ఇచ్చింది. ఏపీకి చెల్లించాల్సిన విద్యుత్ బకాయిలను ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన సమస్యలతో ముడిపెడుతూ తెలంగాణ ప్రభుత్వం దీర్ఘకాలంగా పెండింగ్లో పెడుతూ వస్తోంది. రెండు రాష్ట్రాల మధ్య విద్యుత్ కంపెనీల లావాదేవీల ప్రక్రియ
ఇబ్రహీంపట్నం సీహెచ్‌సీలో కుటుంబనియంత్రణ ఆపరేషన్ చికిత్సలు వికటించి రెండు రోజుల్లో నలుగురు తల్లులు మృత్యువాత పడ్డారు.ఈ నేపథ్యంలో ఇబ్రహీంపట్నంలో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. మృతుల కుటుంబసభ్యులు, బంధువులు స్థానిక అంబేడ్కర్ చౌరస్తాలో బైఠాయించారు.
తెలంగాణ సీఎం కేసీఆర్ రేపు బీహార్ పర్యటనకు వెళ్లనున్నారు. గతంలో ప్రకటించిన మేరకు, గాల్వాన్ ఘర్షణల్లో అమరులైన బీహార్ కు చెందిన భారత సైనికుల కుటుంబాలకు ఆర్థిక సహాయం అందజేయనున్నారు కేసీఆర్.