Home / TS news
మున్సిపాలిటీలు, కార్పోరేషన్లలో ఆస్తి పన్ను బకాయిదారులకు ప్రభుత్వం వన్‌టైం సెటిల్మెంట్ స్కీం గడువు రేపటితో ముగియనుంది.
తెలంగాణలో శీతాకాలం ప్రారంభంలోనే, విపరీతంగా చలి ఉంది. రాష్ట్ర రాజధానిలో పగటి ఉష్ణోగ్రత 30 డిగ్రీల సెల్సియస్ కంటే తక్కువగానే ఉంటుంది. గతంలో 19-21 డిగ్రీల సెల్సియస్‌గా ఉన్న రాత్రి కనిష్ట ఉష్ణోగ్రత ఇప్పుడు 16 డిగ్రీల సెల్సియస్‌కి పడిపోయింది.
రాజాసింగ్ పై పెట్టిన పీడీ యాక్ట్‌ను అడ్వైజరీ బోర్డు సమర్ధించింది. తనపై పీడీ యాక్ట్ కేసు కొట్టివేయాలన్న రాజాసింగ్ విజ్ణప్తిని సలహామండలి కమిటి తిర్కసరించింది.
బతికి ఉన్నవాళ్లను చనిపోయిన్నట్లుగా రికార్డుల్లోకి ఎక్కించడం ఆ సార్ కు వెన్నతో పెట్టిన విద్య. అయితే అబద్ధాన్ని ఎక్కువ రోజుల దాచలేమని గుర్తించేలేక పోయిన ఆ సార్ చివరకు అడ్డంగా దొరికిపోయారు. ఆ సంఘటన సంగారెడ్డి జిల్లాలో చోటుచేసుకొనింది.
బెడ్ దొరకదు. స్ట్రెచర్ ఉండదు. అడుగడుగునా సమస్యలే. పేరు గొప్ప, ఊరు దిబ్బ అన్నట్లు తయారైంది హైదరాబాద్ నిమ్స్ ఆస్పత్రి పరిస్థితి.
పెదపల్లి జిల్లా విషాదం చోటు చేసుకొనింది. ఎలిగేడు మండలం సూల్తాన్ పూర్ లో విద్యుత్ షాక్ కు గురై దంపతులు మృతి చెందారు.
వరంగల్ ఏజీఎం ఆసుపత్రిలో రోగులు, వైద్య సిబ్బంది హడలెత్తారు. ఓ త్రాచుపాము ఆసుపత్రిలోకి ప్రవేశించడంతో ఈ ఘటన చోటుచేసుకొనింది
రైతు గాఢ నిద్రలోకి జారుకున్నాక..గాలికి చలిమంట ఉవ్వెత్తున ఎగిసి పాకకు అంటుకున్నాయి.ఆ క్షణాల్లోనే మంటలు పాక మెుత్తం వ్యాపించాయి.చుట్టూ పక్కల ఎవరు లేకపోవడంతో బయటకు రాలేకపోయిన రైతు భూమన్న అక్కడిడక్కడే కాలి బూడిదైపోయాడు.
ఆదాయ సమీకరణ మార్గాల్లో భాగంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరికొన్ని ఆస్తులను విక్రయించేందుకు సిద్ధమైంది. ఇప్పటికే ఖాళీ స్థలాలు, రాజీవ్ స్వగృహ ఫ్లాట్లను విక్రయించిన ప్రభుత్వం. తాజాగా రాజీవ్ స్వగృహ సహా ఇతర ఆస్తుల అమ్మకం చేపట్టనుంది.
తెలంగాణ రాష్ట్రంలోని 416 ఆస్పత్రులకు నోటీసులు జారీ చేశామని హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా క్లినిక్ లు, ఆస్పత్రులను తనిఖీలు చేస్తున్నామన్నారు.