Home / Trending
రాబోయే రెండు నెలల్లో, దీపావళి నాటికి, మేము ఢిల్లీ, ముంబై, కోల్‌కతా మరియు చెన్నైతో సహా పలు కీలక నగరాల్లో జియో 5Gని ప్రారంభిస్తాము అంటై రిలయన్స్ ఇండస్టీస్ గ్రూప్ చైర్మన్ మరియు మేనేజింగ్ డైరక్టర్ ముఖేష్ అంబానీ తెలిపారు.
న్యూజెర్సీలోని ఎడిసన్ సిటీలో తమ ఇంటివద్ద బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ లైఫ్ సైజ్ విగ్రహాన్ని భారతీయ-అమెరికన్ కుటుంబం ఏర్పాటు చేసింది.ఎడిసన్‌లోని రింకు మరియు గోపీ సేథ్‌ల ఇంటి వెలుపల భారీ ఎత్తున ప్రజలు గుమికూడి పటాసులు కాల్చారు. గోపీ సేథ్ ఇంటర్నెట్ సెక్యూరిటీ ఇంజనీర్ గా పనిచేస్తున్నారు.
మలైకా అరోరా మరియు అర్జున్ కపూర్ గత చాలా సంవత్సరాలుగా రిలేషన్ షిప్ లో ఉన్నారు. వారి చిత్రాలు మరియు వీడియోలు సోషల్ మీడియాలో సులభంగా వైరల్ అవుతాయి మరియు కొంతమంది నెటిజన్లు వారి వయస్సు అంతరం కోసం వారిని ఎల్లప్పుడూ ట్రోల్ చేసినప్పటికీ, అర్జున్ మరియు మలైకా ఎల్లప్పుడూ తమ అభిమానులకు జంటగానే కనిపిస్తారు.
భారీ వర్షాలకు పాకిస్థాన్ అతలాకుతలం అవుతోంది. వరదల ధాటికి దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 343 మంది చిన్నారులతో సహా 937 మంది మృతి చెందారు. దాదాపు మూడు కోట్ల మంది నిరాశ్రయులయ్యారు. దీంతో పాక్ ప్రభుత్వం గురువారం నేషనల్ ఎమర్జెన్సీ ప్రకటించింది.
రణబీర్ కపూర్ మరియు అలియా భట్ నటించిన తాజా చిత్రం బ్రహ్మాస్త్ర: పార్ట్ వన్-శివ సెప్టెంబర్ 9న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. విడుదలకు ముందే ఈ సినిమా ప్రమోషన్స్ జోరుగా సాగుతున్నాయి. ఈ సినిమా ప్రమోషన్ కొంత కాలంగా కొనసాగుతోంది.
కేంద్ర రైల్వే మంత్రి అశ్వనీ వైష్ణవ్ ట్విట్టర్లో వందేభారత్-2 స్పీడ్ ట్రయల్ కోట-నాగ్డా సెక్షన్ మధ్య 120/130/150 మరియు 180 కి.మీగా ఉందని రాసారు.
మహారాష్ట్ర స్టేట్ రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ ఇటీవల ఆగస్టు 26 నుంచి 75 ఏళ్లు పైబడిన వారు తమ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించవచ్చని పేర్కొంది. ఉచిత ప్రయాణానికి వారు తమ టిక్కెట్లను ఆగస్టు 26లోపు బుక్ చేసుకున్నట్లయితే ఛార్జీల వాపసు పొందుతారు, 65 మరియు 75 సంవత్సరాల మధ్య వయస్సు గల వారు ఎంపికచేసిన బస్సుల్లో టిక్కెట్ ఛార్జీలపై 50 శాతం రాయితీని పొందుతారు
దుబాయ్ నగరంలోని 80 మిలియన్ డాలర్ల బీచ్ సైడ్ విల్లాను రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ చిన్నకుమారుడు అనంత్ అంబానీ కొనుగోలు చేసారు. అయితే ఈ డీల్ ను గోప్యంగా ఉంచారు.
చాలా మంది కలలు కంటారు. కాని ఆ కలలను సాకారం చేసుకునేది కొంతమందే. ఎందుకంటే ప్రయత్నం చేయనివారు కొంతమంది అయితే మధ్యలో వైఫల్యాలు ఎదురై వెనక్కి తగ్గేవారు మరికొంతమంది. చివరివరూ నిలబడి గెలిచే వారు కొంతమందే. తమిళనాడుకు చెందిన శివగురు ప్రభాకరన్ ఈ కోవలోకే వస్తాడు. పేదరికాన్ని, కష్టాలను ఎదుర్కొని తన స్వప్నమయిన సివిల్ సర్వీస్ ను సాదించాడు.
ఆమె ఓ సాధారణ కానిస్టేబుల్. విధి నిర్వహణ, కుటుంబ బాధ్యతలతో తీరికలేని జీవితం. అయినా డీఎస్పీ కావాలని తను కన్నకలను సాకారం చేసుకునేందుకు ఏమాత్రం రాజీ పడకుండా రాత్రింబవళ్లు కష్టపడింది. తన పోరాట పటిమకు విధి సైతం తలవంచడంతో కానిస్టేబుల్ అనుకున్నది సాధించింది.