Home / Tirumala Srivaru
తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఐదో రోజు శనివారం రాత్రి శ్రీ మలయప్పస్వామివారు తనకెంతో ప్రీతిపాత్రమైన గరుడ వాహనంపై భక్తకోటికి దర్శనమిచ్చారు. స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చారు. ఏనుగులు, అశ్వాలు ఠీవిగా ముందు వెళుతుండగా భక్తుల కోలాటాలు, మంగళ వాయిద్యాలు, ఇతర కళాప్రదర్శనల నడుమ వాహనసేవ కోలాహలంగా సాగింది. తిరుమాఢ వీధుల్లో స్వామివారి ఊరేగుతూ భక్తులకు దర్శనభాగ్యం కల్పించారు.
అలంకార ప్రియుడిగా పూజలందుకుంటున్న తిరుమలేశుడికి ప్రకృతి దాసోహం అంటుంది. సప్తగిరుల్లో లభ్యమయ్యే ప్రకృతి సిద్ధమైన ఫలపుష్పాలనే కాకుండా దేశ, విదేశాల నుంచి ఫలపుష్పాదులను తెప్పించి స్వామివారిని అలంకరిస్తుంటారు అర్చకస్వాములు. శ్రీవారి ఉత్సవాల్లో భాగంగా స్వామివారికి పూటకో అలంకరణ చేస్తారు.