Home / the elephant whisperers
ఆస్కార్ బహుమతి పొందిన డాక్యుమెంటరీ ది ఎలిఫెంట్ విస్పరర్స్ ద్వారా ప్రసిద్ధి చెందిన జంట బొమ్మన్, బెల్లీ డాక్యుమెంటరీ దర్శకురాలు కార్తికి గోన్సాల్వేస్ నుండి రూ. 2 కోట్ల మేరకు లీగల్ నోటీసు జారీ చేసారు. ఈ ప్రాజెక్టు నుంచి వచ్చే ఆదాయంతో తమకు ఇల్లు, మల్టీ పర్పస్ వాహనం, వన్ టైమ్ పేమెంట్ ఇస్తామని చెప్పి ఇవ్వలేదని వారు ఈ నోటీసులో ఆరోపించారు.
ఆస్కార్ బహుమతి పొందిన డాక్యుమెంటరీ 'ది ఎలిఫెంట్ విస్పరర్స్'లో నటించిన బెల్లిని , తమిళనాడు ప్రభుత్వం రాష్ట్రంలో మొదటి మహిళా కేర్‌టేకర్‌గా నియమించింది. బెల్లి నీలగిరి జిల్లాలోని తెప్పక్కడు ఏనుగుల శిబిరంలో మావటికి సహాయకురాలిగా నియమించబడింది.
:కార్తికి గోస్నాల్వ్స్ యొక్క ది ఎలిఫెంట్ విస్పరర్స్ డాక్యుమెంటరీ బెస్ట్ షార్ట్‌గా ఆస్కార్ అవార్డును గెలుచుకున్నప్పటి నుండి, బొమ్మన్ మరియు బెల్లీ దంపతులు వార్తల్లో నిలిచారు. రఘు అనే అనాథ ఏనుగు పిల్లను చూసుకున్న జంట గా వారు మిలియన్ల మంది హృదయాలను గెలుచుకున్నారు.
ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రి అంతా గర్వంగా విశ్వ వేదికపై తలెత్తుకునేలా చేశాయి మన చిత్రాలు. 95వ ఆస్కార్ వేడుకల్లో నాటు నాటు పాట పాటకు ఆస్కార్ అవార్డు దక్కడం దేశ ప్రజల విజయంగా భావిస్తున్నారు. బెస్ట్ ఒరిజినల్ క్యాటగిరీలో ఆస్కార్ అవార్డు అందుకున్న నాటు నాటు సాంగ్‌తో ఆస్కార్ వేదిక దద్దరిల్లిన విషయం తెలిసిందే. అలాగే బెస్ట్ డాక్యుమెంటరీ షార్ట్ ఫిల్మ్‌గా ‘ది ఎలిఫెంట్ విస్పరర్స్’ అవార్డు గెలుచుకుంది.