Home / Telangana polls
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపులో కాంగ్రెస్ పార్టీ స్పష్టమైన ఆధిక్యాన్ని కనబరుస్తోంది. హంగ్కి ఏ మాత్రం అవకాశం లేని రీతిలో దూసుకు పోతోంది. కాంగ్రెస్ పార్టీ 61 స్థానాల్లో లీడింగులో ఉండి మ్యాజిక్ ఫిగర్ దాటేసింది. రెండవ స్థానంలో బిఆర్ఎస్ 30 స్థానాల్లో కొనసాగుతోంది. బిజెపి 11, ఎంఐఎం 4 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నాయి.
తెలంగాణలో ఎన్నికల ప్రచారం ముగిసిందని తెలంగాణ రాష్ట్ర ఎన్నికల అధికారి వికాస్ రాజ్ స్పష్టం చేశారు. సాయంత్రం 5గంటలకు ప్రచారం ముగిసిన వెంటనే ఆయన మీడియాతో మాట్లాడారు. రాజకీయ ప్రకటనలు ఇవ్వకూడదని వికాస్ రాజ్ రాజకీయనాయకులకు సూచించారు.
నవంబర్ 30న జరగనున్న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల కోసం 2.5 లక్షల మంది సిబ్బంది ఎన్నికల విధుల్లో నిమగ్నమై ఉంటారని చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ (సీఈవో) వికాస్ రాజ్ తెలిపారు. ఇప్పటివరకు 1,68,612 పోస్టల్ బ్యాలెట్లు జారీ చేయగా నవంబర్ 26 వరకు 96,526 పోలింగ్ జరిగినట్లు తెలిపారు.
నవంబర్ 30న జరగనున్న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో 29,267 మంది పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు వేయనున్నారని తెలంగాణ చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ కార్యాలయం తెలిపింది. ఇప్పటి వరకు 9,174 పోస్టల్ బ్యాలెట్లు అందాయని అధికారులు తెలిపారు
తెలంగాణలో ఎన్నికల వేడి రోజు రోజుకు పెరిగిపోతుంది. ఇక నామినేషన్ల ఘట్టం ముగియడంతో ఇవాళ నామినేషన్ల పరిశీలన అంకం మొదలైంది. ఈ నెల 15వ తేదీలోపు నామినేషన్ల ఉపసంహరణకు ఈసీ గడువు విధించింది. పోటీ నుంచి తప్పుకోవాలనుకున్నవారు 15లోపు ఉపసంహరించుకోవాలని సూచించింది.
తెలంగాణ శాసన సభ ఎన్నికలలో జనసేన పోటీ చేయవలసిందేనని జనసేన తెలంగాణ నాయకులు పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్లోని జనసేన తెలంగాణ రాష్ట్ర శాఖ కార్యాలయంలో మంగళవారం రాత్రి జనసేన నాయకులతో పవన్ కళ్యాణ్ సమావేశమయ్యారు.