Home / Telangana News
పార్లమెంట్ భవనానికి అంబేడ్కర్ పేరు పెట్టాలని మంత్రి కేటీఆర్ డిమాండ్ చేశారు. దీనికి సంబంధించి నేడు అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెట్టారు.
శాసన సభ సమావేశాలు రసవత్తరంగా ప్రారంభమయ్యాయి. కాగా నేడు అసెంబ్లీ సమావేశాల నుంచి భాజపా ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ను సస్పెండ్ చేస్తూ సభాపతి ఉత్తర్వులు జారీ చేశారు.
నిరుద్యోగులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరో తీపి కబురు చెప్పింది. తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ)మరో భారీ నోటిఫికేషన్ విడుదల చేసింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న 833 ఇంజినీరింగ్ ఉద్యోగాల భర్తీకి తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది.
రాజన్న సిరిసిల్ల జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. జిల్లా వ్యాప్తంగా ఎడతెరపి లేకుండా వర్షం కురుస్తున్న వర్షం దాటికి ఎల్లమ్మగుడి కాలువ పొంగిపొర్లుతుంది. అయితే ప్రమాదవశాత్తు కాలువ ప్రవాహంలో ఓ కారుకొట్టుకుపోయింది. అందులోని ఇద్దరు వ్యక్తులు నీటమునిగి మరణించారు.
హైదరాబాద్‌లో అదృశ్యమైన యువతి సాయిప్రియ కథ విషాదాంతమైంది. నాలుగు రోజుల క్రితం సాయిప్రియ హైదరాబాద్ నుంచి అదృశ్యమై.. వనపర్తిలో శవమై కనిపించింది. ఆమెను ప్రియుడే దారుణంగా హతమార్చాడు. సాయిప్రియను హత్య చేసి వనపర్తి సమీపంలో మృతదేహాన్ని పూడ్చిపెట్టాడు శ్రీశైలం. గతంలో సాయి ప్రియ, శ్రీశైలం ప్రేమించుకున్నారు. అయితే విషయం ఇంట్లో తెలియడంతో సాయిప్రియ తల్లి దండ్రులు వారించారు. దీంతో సాయి ప్రియ అతనికి దూరంగా ఉంటూ వచ్చింది.
తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడుపై వైసిపి నేత లక్ష్మీ పార్వతి దాఖలు చేసిన కేసులో ఆమెకు సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. ఒకరి ఆస్తులు తెలుసుకోవడానికి మీరు ఎవరంటూ కేసును ధర్మాసనం కొట్టేసింది.
తెలంగాణ సీఎం కేసీఆర్ దేశ రాజకీయాలపై హాట్ కామెంట్స్ చేశారు. కేంద్రంలో ఉన్న రైతు వ్యతిరేక బీజేపీ ప్రభుత్వాన్ని సాగనంపుదామని ప్రజలకు పిలుపునిచ్చారు. రాబోయే ఎన్నికల్లో ఢిల్లీ గడ్డపై మన ప్రభుత్వమే రాబోతోందని ధీమా వ్యక్తం చేశారు.
సెప్టెంబర్ 17 ను ‘తెలంగాణ జాతీయ సమైక్యతా దినం’ గా పాటించాలని తెలంగాణ కేబినెట్ నిర్ణయించింది. సెప్టెంబర్ 16, 17, 18 తేదీలల్లో మూడు రోజుల పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా.. ‘తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాల’ ప్రారంభ వేడుకలను ఘనంగా నిర్వహించాలని నిర్ణయించింది.
కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు వికటించి ఇబ్రాహీంపట్నంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మహిళలను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పరామర్శించారు.
తెలంగాణఐటీ, మున్సిపల్ శాఖా మంత్రి, కల్వకుంట్ల తారక రామారావు కు కరోనా సోకింది. స్వల్ప లక్షణాలతో కొవిడ్ -19 పరీక్ష నిర్వహించుకోగా.. పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యిందని ఆయన వెల్లడించారు.