Home / Telangana News
తెలంగాణ రాష్ట్ర వాప్యంగా సెప్టెంబర్ 17 తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. పోటాపోటీగా ఇటు తెరాస, భాజపా అటు కాంగ్రెస్ పార్టీలు ఈ వేడుకలను జరుపుతున్నాయి.
తెలంగాణ విమోచన దినోత్సవం నిర్వహించేందుకు ఇంతవరకూ ఏ ప్రభుత్వమూ సాహసించలేదని, అన్ని పార్టీలు భయపడ్డాయి కానీ ఈ ఏడాది ప్రధాని కృషితో భాగ్యనగరంలో స్వాతంత్య్ర జెండా రెపరెపలాడుతుందని కేంద్రహోంమంత్రి అమిత్షా అన్నారు.
తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాలను కేసీఆర్ ప్రభుత్వం వైభవంగా నిర్వహిస్తుంది. దానిలో భాగంగా నేడు హైదరాబాద్ లోని ఎన్టీఆర్ స్టేడియంలో భారీ బహిరంగ సభను నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో నగరంలోని పలు ప్రాంతాల్లో ఈరోజు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు అమలు కానున్నాయి.
దేశమంతా ఆధార్ నెంబరుకు ఓటరు కార్డు లింక్ చేసుకోవాలన్న కేంద్ర ఎన్నికల కమీషన్ ఆదేశాలతో తెలంగాణ సరికొత్త రికార్డు నెలకొల్పింది
సికింద్రాబాద్ రూబీ లాడ్జిలో జరిగిన అగ్రిప్రమాదం మరువకముందే హైదరాబాద్ నగరంలో మరో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 36లో ఉన్న ఓ పబ్లో అగ్నికిలలు ఎగసిపడ్డాయి.
పార్లమెంట్ భవనానికి అంబేడ్కర్ పేరు పెట్టాలని మంత్రి కేటీఆర్ డిమాండ్ చేశారు. దీనికి సంబంధించి నేడు అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెట్టారు.
శాసన సభ సమావేశాలు రసవత్తరంగా ప్రారంభమయ్యాయి. కాగా నేడు అసెంబ్లీ సమావేశాల నుంచి భాజపా ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ను సస్పెండ్ చేస్తూ సభాపతి ఉత్తర్వులు జారీ చేశారు.
నిరుద్యోగులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరో తీపి కబురు చెప్పింది. తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ)మరో భారీ నోటిఫికేషన్ విడుదల చేసింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న 833 ఇంజినీరింగ్ ఉద్యోగాల భర్తీకి తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది.
రాజన్న సిరిసిల్ల జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. జిల్లా వ్యాప్తంగా ఎడతెరపి లేకుండా వర్షం కురుస్తున్న వర్షం దాటికి ఎల్లమ్మగుడి కాలువ పొంగిపొర్లుతుంది. అయితే ప్రమాదవశాత్తు కాలువ ప్రవాహంలో ఓ కారుకొట్టుకుపోయింది. అందులోని ఇద్దరు వ్యక్తులు నీటమునిగి మరణించారు.
హైదరాబాద్లో అదృశ్యమైన యువతి సాయిప్రియ కథ విషాదాంతమైంది. నాలుగు రోజుల క్రితం సాయిప్రియ హైదరాబాద్ నుంచి అదృశ్యమై.. వనపర్తిలో శవమై కనిపించింది. ఆమెను ప్రియుడే దారుణంగా హతమార్చాడు. సాయిప్రియను హత్య చేసి వనపర్తి సమీపంలో మృతదేహాన్ని పూడ్చిపెట్టాడు శ్రీశైలం. గతంలో సాయి ప్రియ, శ్రీశైలం ప్రేమించుకున్నారు. అయితే విషయం ఇంట్లో తెలియడంతో సాయిప్రియ తల్లి దండ్రులు వారించారు. దీంతో సాయి ప్రియ అతనికి దూరంగా ఉంటూ వచ్చింది.