Home / Telangana News
ఏపీ, తెలంగాణలోని పలు ప్రాంతాల్లో ఈ నెల 18,19,20న భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. లోతట్టు ప్రాంత ప్రజలను అప్రమత్తంగా ఉండాలని వాతావరణ కేంద్రం సూచించింది.
ఎంఐఎం స్వాతంత్ర్య సమరయోధులు తుర్రేబాజ్ ఖాన్, మౌల్వీ అల్లావుద్దీన్ల వారసులని, ఖాసిం రిజ్వీ కాదని ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ అన్నారు.టీఎస్ జాతీయ సమైక్యతా దినోత్సవ వేడుకల్లో భాగంగా పార్టీ బైక్ ర్యాలీ అనంతరం బహిరంగ సభలో ఒవైసీ ప్రసంగించారు.
పటాన్చెరు నియోజకవర్గంలో పొలిటికల్ వార్ హీటెక్కుతోంది. గూడెం బ్రదర్స్ జోరు వార్ వన్ సైడ్ అన్నట్టుగా ఉంది. ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి, ఆయన తమ్ముడు గూడెం మధుసూదన్ రెడ్డి వ్యూహత్మకంగా నియోజకవర్గంలో పావులు కదుపుతున్నారు. రాజకీయంగా ప్రత్యర్థి వర్గం ఎత్తులను ఎప్పటికప్పుడు చిత్తు చేస్తూ దూసుకెళ్తున్నారు.
కేంద్ర హోం మంత్రి అమిత్ షా హైదరాబాద్ పర్యటనలో బిజీబిజీగా గడుపుతున్నారు. కాగా ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ఇంటికి ఆయన వెళ్లారు. ఇటీవలే ఈటల తండ్రి మల్లయ్య మృతి చెందారు. కాగా వారి ఇంటికి వెళ్లి మల్లయ్య చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. వారి కుటుంబ సభ్యులను అమిత్ షా పరామర్శించారు.
రాష్ట్రంలోని గిరిజనులకు సీఎం కేసీఆర్ తీపి కబురు చెప్పారు. గిరిజనులకు 10 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తామని, ఇందుకు సంబంధించిన జీవోను వారం రోజుల్లో విడుదల చేస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు.
అసలే తెలంగాణ రాష్ట్రంలో తెరాస వర్సెస్ భాజపా అన్నట్టుగా రాజకీయం వేడెక్కుతుంది. ఈ నేపథ్యంలోనే కేంద్ర హోం మంత్రి అమిత్ షా పర్యటనలో పోలీసుల భద్రతా లోపం చోటుచేసుకుంది. అమిత్ షా కాన్వాయ్ ని తెరాస నేత కారు అడ్డగించింది.
తెలంగాణ రాష్ట్ర వాప్యంగా సెప్టెంబర్ 17 తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. పోటాపోటీగా ఇటు తెరాస, భాజపా అటు కాంగ్రెస్ పార్టీలు ఈ వేడుకలను జరుపుతున్నాయి.
తెలంగాణ విమోచన దినోత్సవం నిర్వహించేందుకు ఇంతవరకూ ఏ ప్రభుత్వమూ సాహసించలేదని, అన్ని పార్టీలు భయపడ్డాయి కానీ ఈ ఏడాది ప్రధాని కృషితో భాగ్యనగరంలో స్వాతంత్య్ర జెండా రెపరెపలాడుతుందని కేంద్రహోంమంత్రి అమిత్షా అన్నారు.
తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాలను కేసీఆర్ ప్రభుత్వం వైభవంగా నిర్వహిస్తుంది. దానిలో భాగంగా నేడు హైదరాబాద్ లోని ఎన్టీఆర్ స్టేడియంలో భారీ బహిరంగ సభను నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో నగరంలోని పలు ప్రాంతాల్లో ఈరోజు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు అమలు కానున్నాయి.
దేశమంతా ఆధార్ నెంబరుకు ఓటరు కార్డు లింక్ చేసుకోవాలన్న కేంద్ర ఎన్నికల కమీషన్ ఆదేశాలతో తెలంగాణ సరికొత్త రికార్డు నెలకొల్పింది