Home / Tamil Nadu Governor R N Ravi
తమిళనాడు గవర్నర్ ఆర్ఎన్ రవిని 'బర్తరఫ్' చేయాలని కోరుతూ రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు వినతిపత్రం అందజేసిందని డీఎంకే తెలిపింది. నవంబర్ 2న అందజేసిన ఈ వినతిపత్రంలోపెండింగ్లో ఉన్న నీట్ బిల్లుతో సహా గవర్నర్కు సంబంధించిన అనేక సమస్యలను తెలిపారు.
అభిప్రాయాలు వ్యక్తం చేసేందుకు ఏ గవర్నర్ కైనా అన్ని హక్కులు ఉంటాయని, అంతమాత్రాన వారిని రాజీనామా చేయాలని కోరడం భావ వ్యక్తీకరణ స్వేచ్ఛను హరించడమేనని తెలంగాణ గవర్నర్ తమిళసై సౌందర్యరాజన్ అన్నారు.
అనుకూలంగా ఉంటే సరి, లేదంటూ రాజ్యంగ పదవిని అడ్డుపెట్టుకొని ప్రతిపక్షాలను ఓ ఆటాడుకొంటున్న కేంద్ర ప్రభుత్వ చర్యలపై విసిగిపోతున్నారు. ముఖ్యంగా గవర్నర్ గిరి వ్యవస్ధను భ్రష్టుపట్టిస్తున్నారని పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు గొల్లుమంటున్న తరుణంలో తాజాగా గవర్నర్ గారు మీరు పదవి నుండి తప్పుకోండంటూ తమిళనాడు అధికార ప్రభుత్వం డిఎంకే కూటమి డిమాండ్ చేసింది.