Last Updated:

Tamilisai Soundararajan: గవర్నర్ రాజీనామా కోరడం.. భావ స్వేచ్చను హరించడమే.. తమిళసై

అభిప్రాయాలు వ్యక్తం చేసేందుకు ఏ గవర్నర్ కైనా అన్ని హక్కులు ఉంటాయని, అంతమాత్రాన వారిని రాజీనామా చేయాలని కోరడం భావ వ్యక్తీకరణ స్వేచ్ఛను హరించడమేనని తెలంగాణ గవర్నర్ తమిళసై సౌందర్యరాజన్ అన్నారు.

Tamilisai Soundararajan: గవర్నర్ రాజీనామా కోరడం.. భావ స్వేచ్చను హరించడమే.. తమిళసై

puducherry: అభిప్రాయాలు వ్యక్తం చేసేందుకు ఏ గవర్నర్ కైనా అన్ని హక్కులు ఉంటాయని, అంతమాత్రాన వారిని రాజీనామా చేయాలని కోరడం భావ వ్యక్తీకరణ స్వేచ్ఛను హరించడమేనని తెలంగాణ గవర్నర్ తమిళసై సౌందర్యరాజన్ అన్నారు. పుదుచ్చేరికి కూడా తమిళ సై ఇన్ చార్జ్ లెప్టినెంట్ గవర్నర్ గా వ్యవహరిస్తున్నారు. నిన్నటిదినం ఓ సదస్సులో పాల్గొన్న ఆమె ఈ మేరకు వ్యాఖ్యానించారు.

పొరుగు రాష్ట్రం తమిళనాడు గవర్నర్ రాజీనామాకు కొన్ని రాజకీయ పార్టీలు డిమాండ్ చేయడం సరికాదన్నారు. గవర్నర్లు వ్యక్తపరిచే అభిప్రాయాలతో ఎవరైనా విభేదిస్తే దానిపై వారు తమ ప్రతివాదన వినిపించవచ్చన్నారు. అంతేగాని వారు అభిప్రాయాలు వెలిబుచ్చినంత మాత్రానా గవర్నర్ పదవి నుండి తొలగించాలనో, వెనక్కి పిలిపించాలనో డిమాండ్ చేయడం ఏ మాత్రం తగదన్నారు.

ఇది కూడా చదవండి: CM KCR: మోదిని అడ్డుకొనే పనిలో కేసిఆర్.. అన్ని రాష్ట్రాలకు ప్రలోభాల డీల్ వీడియోలు

ఇవి కూడా చదవండి: