Home / T20 world cup
టీ20 ప్రపంచకప్‌కు దూరమవ్వడంపై జస్ప్రీత్ బుమ్రా ట్విట్టర్ వేదికగా స్పందించాడు. మెగా టోర్నీ నుంచి తప్పుకోవడం పట్ల భావోద్వేగానికి గురయ్యాడు. తాను గాయం నుంచి కోలుకోవాలని కోరుకున్న పత్రీ ఒక్కరికి బుమ్రా ధన్యవాదాలు చెప్పారు. ఆస్ట్రేలియా వెళ్లి టీమిండియాకు మద్దతు తెలుపుతానంటూ ట్వీట్ చేశాడు.
ఆస్ట్రేలియాలో జరిగే ఐసిసి పురుషుల టి20 ప్రపంచ కప్ 2022లో విజేతకు $1.6 మిలియన్లు లేదా రూ. 13 కోట్ల చెక్కు ప్రైజ్ మనీగా దక్కుతుందని అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ ( ఐసిసి ) ఈ రోజు ప్రకటించింది.
టీమిండియాకు భారీ షాక్. ప్రతిష్టాత్మక టీ20 ప్రపంచకప్ 2022 నుంచి టీం ఇండియా స్టార్ క్రికెటర్ తప్పుకున్నాడు. భారత స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా ఈ మెగా టోర్నీ నుంచి వైదొలిగాడు. తీవ్రమైన వెన్ను నొప్పి కారణంగా టీ20 ప్రపంచకప్‌లో పేస్ గుర్రం బుమ్రా ఆడడం లేదు.
యువరాజ్ సింగ్ ఆరు బంతులకు ఆరు సిక్సర్లు కొట్టి నేటికీ 15 ఏళ్ళు , టీ20 అంతర్జాతీయ క్రికెట్లో 15 ఏళ్ల క్రితం టీమిండియా మాజీ బ్యాటర్ యువరాజ్ సింగ్ క్రికెట్ చరిత్రలో ఒక మైలు రాయిని సృష్టించి తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నారు.
సంజూ శాంసన్ అభిమానుల ఆగ్రహాన్ని చల్లార్చేందుకు బీసీసీఐ దిద్దుబాటు చర్యలు చేపట్టింది. టీమ్ఇండియా క్రికెటర్ సంజూ శాంసన్‌ను భారత్ ఏ జట్టుకు కెప్టెన్‌గా ప్రకటించింది. న్యూజిలాండ్-ఏతో ఇండియాలో జరిగే మూడు వన్డేల సిరీసులకు భారత సెలక్టర్లు జట్టును ప్రకటించారు.
ఇండియా పాకిస్థాన్ మ్యాచ్ అంటే ఇష్టపడని క్రికెట్ అభిమానులుండరు. ఆ మ్యాచ్ ఆద్యంతం ఎప్పడు ఏం జరుగుతుందా.. ఎవరెలా ఆడతారా అనే ఆసక్తితో చూస్తుంటారు. టీ20 వరల్డ్ కప్‌లో భాగంగా అక్టోబర్ 23వ తేదీన ఇండియా పాకిస్థాన్ మధ్య జరిగే మ్యాచ్ కు టికెట్స్ ఫుల్ అయ్యాయి.
ఇటీవల కాలంలో జరిగిన క్రికెట్ మ్యాచ్ లలో బుమ్రా కనిపించకపోవడం చూసాము. అయితే గాయం అయిన కారణంగా ఆసియా కప్ కు దూరమైన టీమ్ఇండియా సీనియర్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా తిరిగి జట్టులోకి వచ్చాడు.