Home / Sullurpet
దేశానికి అంతర్జాతీయంగా పేరు తీసుకొచ్చిన కొన్ని ప్రాంతాలకు ఆ పట్టణం ఓ ల్యాండ్ మార్క్.. అక్కడి పురపాలక సంఘంలో అడుగు భూమి కొనాలంటే ఆకాశాన్నంటే ధరలు, కాని నేటి ప్రభుత్వ పాలనలో పేరుగొప్ప ఊరు దిబ్బ అన్న చందంగా మారి పట్టణంలోని కొన్ని ప్రాంతాలు కళావిహీనంగా తయారైనాయి.
ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో ఓటర్ల నమోదు ప్రక్రియను వేగవంతం చేయాలని సూళ్లూరుపేట పురపాలక సంఘ పరిధిలో అధికారులు సమీక్షా సమావేశం నిర్వహించారు.
ఏపీలో పోలీసు అమరవీరుల దినోత్సవాలను ఘనంగా నిర్వహించుకొన్నారు. అశువులు బాసిన పోలీసులను స్మరించుకొంటూ చేపట్టిన కార్యక్రమాల్లో నేతలు, ప్రజలు, విద్యార్ధులు స్వచ్ఛందంగా పాల్గొని అమరవీరులకు ఘన నివాళులర్పించారు.
తమిళనాడు రాష్ట్రానికి చెందిన విద్యుత్ శాఖ కాంట్రాక్ట్ సిబ్బంది వినూత్నంగా నిరసనలు చేపట్టారు. తమ సమస్యలపై ఆ రాష్ట్రానికి చెందిన ప్రభుత్వం పట్టించుకోవడం లేదంటూ పొరుగు రాష్ట్రమైన ఆంధ్రాలో తమ నిరసనలు గుప్పించి తమిళనాడు ప్రభుత్వాన్ని ఉలిక్కిపడేలా చేశారు.
సీఎం జగన్మోహన్ రెడ్డిని పేదల పక్షపాతిగా టిటిడి బోర్డు మెంబరు కిలివేటి సంజీవయ్య అభివర్ణించారు. అట్టడుగు వర్గాల ఆశాజ్యోతిగా పేర్కొన్నారు.
దివంగతులైన పెద్దలను స్మరించుకొనే దినాల్లో మహాలయ అమావాస్య ఒకటి. పితృదేవతలను తలచుకుంటూ పేదలకు అన్నదానం చేస్తే వారు స్వర్గ లోప ప్రాప్తిని చేరుకొంటారనేది ఓ భావన. ఈ క్రమంలో తిరుపతి జిల్లా సూళ్లూరుపేట ఆర్యవైశ్య సంఘం ఓ వృద్ధాశ్రమంకు ఫలసరుకుల అందచేసి పెద్దలను స్మరించుకొన్నారు.
తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ శక్తి ఆలయాల్లో ఒకటి, తమిళుల ఆరాధ్య దేవతగా పూజింపబడుతున్న సూళ్లూరుపేట శ్రీ చెంగాళమ్మ పరమేశ్వరి ఆలయ హుండీల లెక్కింపులో రూ. 58,68,427 లను భక్తులు కానుకల రూపంలో చెల్లించుకొన్నారు.
ఆంధ్రప్రదేశ్ లో కొంతమంది రెవిన్యూ సిబ్బంది వ్యవహారం మరీ శృతి మించిపోతుంది. ఏళ్ల తరబడి ప్రజలను కార్యాలయాలకు తిప్పుకొంటున్నారు. లంచాలు ఇచ్చినా ప్రయోజనం నిల్ గా మారింది.