Last Updated:

Couple suicide attempt: పాస్ పుస్తకం ఇవ్వలేదంటూ ఆత్మహత్యాయత్నం

ఆంధ్రప్రదేశ్ లో కొంతమంది రెవిన్యూ సిబ్బంది వ్యవహారం మరీ శృతి మించిపోతుంది. ఏళ్ల తరబడి ప్రజలను కార్యాలయాలకు తిప్పుకొంటున్నారు. లంచాలు ఇచ్చినా ప్రయోజనం నిల్ గా మారింది.

Couple suicide attempt: పాస్ పుస్తకం ఇవ్వలేదంటూ ఆత్మహత్యాయత్నం

Tirupathi: ఆంధ్రప్రదేశ్ లో కొంతమంది రెవిన్యూ సిబ్బంది వ్యవహారం మరీ శృతి మించిపోతుంది. ఏళ్ల తరబడి ప్రజలను కార్యాలయాలకు తిప్పుకొంటున్నారు. లంచాలు ఇచ్చినా ప్రయోజనం నిల్ గా మారింది. చివరకు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లినా ఫలితం శూన్యం మారింది. రెవిన్యూ సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా ఓ జంట ఆత్మహత్యాయత్నానికి పాల్పొడిన ఘటన తిరుపతి కలెక్టరేట్ ఆవరణలో చోటుచేసుకొనింది. సమాచారం మేరకు సూళ్లూరుపేట సాయినగర్ కు చెందిన నాగార్జున భవానీలకు సంబంధించి భూములు ఉన్నాయి. దానికి సంబంధించిన పాసు పుస్తకాల కొరకు ఎన్నోసార్లు రెవిన్యూ కార్యాలయంలో సంప్రదించినా ఫలితం కనపడలేదు. విషయాన్ని ముఖ్యమంత్రి జగన్ దృష్టికి కూడా దంపతులు తీసుకెళ్లారు.

అయినా పాసు పుస్తకాల మంజూరులో ఎలాంటి పురోగతి లేకపోవడంతో స్పందన కార్యాక్రమంలో ఉన్నతాధికారులకు విషయం తెలపాలని దంపతులు తొలుత నిర్ణయించుకొన్నారు. తిరుపతి కలక్టరేట్ కు చేరుకొన్న దంపతులు ఇరువురు ప్రాంగణంలో ఆత్మహత్యాయత్నానికి పాల్పొడ్డారు. పురుగుల మందు తాగి భవాని, చేయి కోసుకొని నాగరాజులు చేసిన ప్రయత్నాన్ని స్ధానికి పోలీసులు అడ్డుకొని ఇరువురిని హుటాహుటిన రూయా వైద్యశాలకు తరలించారు. పాస్ పుస్తకం కొరకు రెవిన్యూ ఇన్స్ పెక్టర్ కు లంచం ఇచ్చినా ఫలితం లేకుండాపోయిందని బాధితులు ఆరోపించడం గమనార్హం.

ఇవి కూడా చదవండి: