Home / srilankan president
శ్రీలంక ప్రధాని రణిల్ విక్రమసింఘేను తాత్కాలిక అధ్యక్షుడిగా లంక స్పీకర్ మహింద అబెవర్ధన బుధవారం నియమించారు. ప్రస్తుత అధ్యక్షుడు గొటబయ రాజపక్స దేశం వీడి వెళ్లడంతో ప్రజలు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. రాజపక్స ఇంతవరకూ తన పదవికి రాజీనామా చేయలేదు. మరోవైపు రాజ్యాంగంలోని 37(1) నిబంధన కింద రణిల్ విక్రమసింఘే
ఆర్థిక, రాజకీయ సంక్షోభంతో అల్లాడిపోతున్న శ్రీలంకలో తీవ్ర నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. అధ్యక్షుడు గొటబాయ రాజపక్సే సతీ సమేతంగా దేశం విడిచి పారిపోయాడు. తొలుత వాయు, జల మార్గాల ద్వారా దేశం నుంచి పారిపోయేందుకు యత్నించిన రాజపక్సేకు.. అధికారులు ఏమాత్రం సహకరించలేదు. అడుగడుగున అడ్డుకున్నారు.
శ్రీలంకలో ఆర్థిక సంక్షోభం తీవ్రంగా పెరిగిపోయింది. దీంతో ఆ దేశ అధ్యక్షుడు గొటబాయ రాజపక్స రాజీనామా చేయాలని దేశవ్యాప్తంగా నిరసనలు మిన్నంటాయి. నిరసనకారులు కొలంబోలోని రాజపక్స ఇంటిని చుట్టుముట్టారు. దీంతో గొటబాయ వారినుంచి తప్పించుకుని పరారయ్యారు. ఆందోళనకారులపై లంక సైన్యం టియర్ గ్యాస్ ప్రయోగించింది.