Last Updated:

Sri Lanka Crisis: శ్రీలంకలో ఎమర్జెన్సీ

శ్రీలంక ప్రధాని ర‌ణిల్ విక్రమసింఘేను తాత్కాలిక అధ్యక్షుడిగా లంక స్పీక‌ర్ మ‌హింద అబెవర్ధన బుధ‌వారం నియమించారు. ప్రస్తుత అధ్యక్షుడు గొట‌బ‌య రాజ‌ప‌క్స దేశం వీడి వెళ్లడంతో ప్రజ‌లు పెద్ద ఎత్తున ఆందోళ‌న‌కు దిగారు. రాజ‌ప‌క్స ఇంత‌వ‌ర‌కూ త‌న ప‌ద‌వికి రాజీనామా చేయ‌లేదు. మ‌రోవైపు రాజ్యాంగంలోని 37(1) నిబంధ‌న కింద ర‌ణిల్ విక్రమసింఘే

Sri Lanka Crisis: శ్రీలంకలో ఎమర్జెన్సీ

Sri Lanka: శ్రీలంక ప్రధాని ర‌ణిల్ విక్రమసింఘేను తాత్కాలిక అధ్యక్షుడిగా లంక స్పీక‌ర్ మ‌హింద అబెవర్ధన బుధ‌వారం నియమించారు. ప్రస్తుత అధ్యక్షుడు గొట‌బ‌య రాజ‌ప‌క్స దేశం వీడి వెళ్లడంతో ప్రజ‌లు పెద్ద ఎత్తున ఆందోళ‌న‌కు దిగారు. రాజ‌ప‌క్స ఇంత‌వ‌ర‌కూ త‌న ప‌ద‌వికి రాజీనామా చేయ‌లేదు. మ‌రోవైపు రాజ్యాంగంలోని 37(1) నిబంధ‌న కింద ర‌ణిల్ విక్రమసింఘేను తాత్కాలిక అధ్యక్షుడిగా నియ‌మించామ‌ని స్పీక‌ర్ వెల్లడించారు.

ఇక ఆందోళనలతో అట్టుడుకుతున్న శ్రీలంకలో మరోసారి ఎమర్జెన్సీ అమలులోకి వచ్చింది. అధ్యక్షుడు గొటబయ రాజపక్స దేశం నుంచి పరారవడంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తంచేశారు. ఒక్కసారిగా రోడ్లపైకి వచ్చి ఆందోళన చేపట్టడంతో పరిస్థితులు అదుపుతప్పాయి. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా అత్యవసర పరిస్థితి విధిస్తున్నట్లు ప్రధానమంత్రి కార్యాలయం ఓ ప్రక‌ట‌న‌లో పేర్కొంది.కనిపిస్తే కాల్చివేయాలని ఆదేశాలు జారీ అయ్యాయి.

ఇవి కూడా చదవండి: