Home / Sriharikota
ఆంధ్రప్రదేశ్ లోని తిరుపతి జిల్లా శ్రీహరికోట నుంచి ప్రయోగించాలనుకున్న ప్రైవేట్ రాకెట్ అగ్నిబాణ్ రాకెట్ ప్రయోగం మరోసారి వాయిదా పడింది. సతీశ్ ధవన్ స్పేస్ సెంటర్ -షార్ లోని ప్రైవేట్ లాంచింగ్ వేదిక నుంచి మంగళవారం ఉదయం ఈ రాకెట్‌ను ప్రయోగించాల్సి ఉన్నది.
చంద్రయాన్-3 విజయం అనంతరం సూర్యుడి దిశగా ఇస్రో ప్రయోగాలకు సిద్ధమైంది. ఇందులో భాగంగా ఆదిత్య-ఎల్1 ఉపగ్రహాన్ని తీసుకొని పీఎస్ఎల్వీ-సి57 వాహకనౌక నింగిలోకి విజయవంతంగా దూసుకెళ్లింది. తిరుపతి జిల్లాలోని సతీశ్ ధావన్ స్పేస్ సెంటర్ తాజాగా ప్రయోగానికి వేదికైంది.
భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో మరో రాకెట్‌ను విజయవంతంగా ప్రయోగించింది. ఆంధ్రప్రదేశ్‌లోని తిరుపతి జిల్లా శ్రీహరికోట నుంచి PSLV-C 56 వాహక నౌక నింగిలోకి దూసుకెళ్లింది. దీనిద్వారా 7 విదేశీ ఉపగ్రహాలను నిర్దేశిత కక్షలోకి పంపించారు. ఇందులో సింగపూర్‌కు చెందిన డీఎస్టీఏ ఎస్టీ ఇంజినీరింగ్ సంస్థకు చెందిన డీఎస్ ఎస్ఏఆర్ఉపగ్రహంతోపాటు నాన్యాంగ్ టెక్నలాజికల్ యూనివర్సిటీకి చెంచిన వెలాక్స్-ఏఎం, ఆర్కేట్, స్కూబ్-2, న్యూలియాన్, గెలాసియా-2, ఓఆర్బీ-12 శాటిలైట్లు ఉన్నాయి. ఇవన్నీ సింగపూర్‌కు చెందినవే కావడం విశేషం.
శ్రీహరికోట నుంచి చిన్న ఉపగ్రహ వాహననౌక SSLV-D2 రాకెట్ నింగిలోకి దూసుకెళ్లింది. శ్రీహరికోట సతీశ్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి ఈ ఉపగ్రహ ప్రయోగం జరిగింది.
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పీఎస్ఎల్వీ-సీ54 రాకెట్ ప్రయోగం విజయవంతం అయ్యింది. శ్రీహరికోటలో సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ (షార్) నుంచి శనివారం ఉదయం 11.56 గంటలకు రాకెట్ నింగిలోకి ఎగిరింది.
భారతదేశపు మొట్టమొదటి ప్రైవేట్‌గా అభివృద్ధి చేసిన రాకెట్, విక్రమ్-ఎస్ శుక్రవారం శ్రీహరికోట స్పేస్‌పోర్ట్‌లోని సౌండింగ్ రాకెట్ కాంప్లెక్స్ నుండి ఉప-కక్ష్య మిషన్‌లో విజయవంతంగా ప్రయోగించబడింది.
భారత అంతరిక్ష పరిశోదన సంస్ధ ఇస్రో సరికొత్త మైలురాయిని అందుకోబోతుంది. ఒక రాకెట్ ద్వారా 6టన్నుల ఉపగ్రహాలను నింగిలోకి పంపిన ఘనతను చేజిక్కించుకోబోతుంది. అందుకు వేదికగా తిరుపతి జిల్లా శ్రీహరికోట అంతరిక్ష ప్రయోగ కేంద్రం సిద్ధమైంది. నేటి అర్ధరాత్రి 12.07 నిమిషాలకు జీఎస్ఎల్వీ మార్క్ 3 – ఎం2 (ఎల్ఏఎం3) రాకెట్ ను ఇస్రో నింగిలోకి పంపనుంది.
ప్రపంచ వ్యాప్తంగా నిర్వహిస్తున్న అంతరిక్ష వారోత్సవాలు నేటితో ముగిసాయి. అక్టోబర్ 4న ప్రారంభమైన వారోత్సవాలు నేటితో పూర్తి అయ్యాయి. తిరుపతి జిల్లా శ్రీహరికోట సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ లో జరిగిన ముగింపు వేడుకలలో ఐఐటి డైరెక్టర్ సత్యన్నారాయణ ముఖ్య అతిధిగా పాల్గొన్నారు.
దేశ వ్యాప్తంగా నేటి నుండి 7రోజుల పాటు చేపట్టనున్న ప్రపంచ అంతరిక్ష్య వారోత్సవాలను తమిళనాడు గవర్నర్ ఆర్.ఎన్. రవి శ్రీహరికోట సతీష్ ధవన్ స్పేస్ సెంటర్లో ప్రారంభించారు