Home / Sr Ntr
సీఎంగా కేసీఆర్ హ్యాటిక్ కొడితే.. ఎన్టీఆర్ ఆత్మ కూడా శాంతిస్తుందని మంత్రి కేటీఆర్ అన్నారు. ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని లకారం ట్యాంక్ బండ్ వద్ద నిర్మించిన ఎన్టీఆర్ పార్కును మంత్రి కేటీఆర్ తాజాగా ప్రారంభించారు. అలాగే లకారం సమీపంలో ఎన్టీఆర్ విగ్రహాన్ని కూడా మంత్రి కేటీఆర్ ఆవిష్కరించారు.
తెదేపా వ్యవస్థాపకులు, విశ్వ విఖ్యాత నట సార్వభౌమ స్వర్గీయ ఎన్టీఆర్ శత జయంతి వేడుకలను ఈ ఏడాది అట్టహాసంగా నిర్వహిస్తున్నారు. ఈ మేరకు ఇప్పటికే ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాల్లో భాగంగా ఆయన అభిమానులు, టీడీపీ నాయకులు ఏడాది పొడవునా అనేక రకాల కార్యక్రమాలు ప్లాన్ చేస్తున్నారు. అయితే ఎన్టీఆర్ శత జయంతి
లెజెండరీ నటులు, తెదేపా పార్టీ స్థాపకులు, మాజీ సీఎం నందమూరి తారక రామారావు శత జయంతి వేడుకలు ఈ ఏడాది ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ మేరకు మే 20న హైదరాబాద్ లోని కూకట్‌పల్లిలో ఎన్టీఆర్ శతజయంతి వేడుక కార్యక్రమం జరగనుంది. ఆ కార్యక్రమానికి హాజరుకావాలంటూ జూనియర్ ఎన్టీఆర్‌కు నందమూరి రామకృష్ణ ఆహ్వాన
ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడలో సీనియర్ ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. విజయవాడ పోరంకిలోని అనుమోలు గార్డెన్స్ లో ఈ కార్యక్రమం జరిగింది. ఈ వేడుకలకు చీఫ్ గెస్ట్‌గా సూపర్ స్టార్ రజినీ కాంత్ హాజరయ్యారు. అంతేకాదు.. ఈ సభలో తెలుగులో ధారాళంగా మాట్లాడుతూ రజనీకాంత్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
విశ్వ విఖ్యాత నటసార్వభౌముడు నందమూరి తారక రామారావు కేవలం హీరో గానే కాకుండా తెలుగు ప్రజల్లో ఆరాధ్య దైవంగా కొలువై ఉన్నారు అని చెప్పడంలో సందేహం లేదు. ఒక వైపు సినిమాల్లోనూ నవరస నటనా సార్వభౌమ .. మరోవైపు రాజకీయాల్లోనూ తనకంటూ ప్రత్యేకంగా ఒక చెరగని ముద్ర వేసుకొని తెలుగు ప్రజల గుండెల్లో నిలిచిపోయారు ఎన్టీఆర్.
ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ కూతురు కంఠమనేని ఉమామహేశ్వరి అంత్యక్రియలు ముగిసాయి. హైదరాబాద్ లోని ఆమె ఇంటినుండి అంతిమయాత్ర జూబ్లీహిల్స్ మహాప్రస్ధానం వరకు సాగింది. సోదరులు బాలకృష్ణ, రామకృష్ణ ఉమామహేశ్వరి పాడె మోసారు.