Home / Somu veerraju
ప్రజల కష్టాలు తెలుసుకొనేందుకు జనవాణి కార్యక్రమాన్ని నిర్వహించేందుకు వైజాగ్ వచ్చిన పవన్ కల్యాణ్ పట్ల పోలీసులు కిరాతకంగా వ్యవహరించాని సోము వీర్రాజు మండిపడ్డారు. పవన్ తో కలిసి సోము వీర్రాజు మీడియాతో మాట్లాడారు.
2024 పార్లమెంటు ఎన్నికల వరకు ఏపీ భాజపా అధ్యక్షడుగా సోము వీర్రాజు కొనసాగనున్నారు. ఈ మేరకు ఆ పార్టీ నేత ప్రకాష్ స్పష్టం చేశారు. ముఖ్య నేతలతో అమరావతిలో చేపట్టిన సమావేశంలో పేర్కొన్నారు.
వైజాగ్ నగరంలో రాష్ట్ర ప్రభుత్వం వ్యవస్ధలను అడ్డుపెట్టుకొని చేస్తున్న అప్రజాస్వామిక విధానాలను ప్రజలందరూ చూస్తున్నారని, పోలీసులు, మంత్రుల పాశవిక చర్యలను ఖండిస్తూ పార్టీలకు అతీతంగా సంఘీభావం తెలిపిన ప్రతివక్కరికి జనసేన అధినేత పవన్ కల్యాణ్ కృతజ్నతలు తెలియచేశారు.
ఏపీ ప్రభుత్వంపై భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు సంచలన వ్యాఖ్యలు చేశారు. వైకాపా హిందూ ధ్వేషాన్ని వెళ్లగక్కుతున్న ప్రభుత్వంగా పేర్కొన్నారు. ప్రముఖ ఆలయాల్లో స్వామి వార్లకు చేపట్టే సేవల ధరలను అధిక రెట్లు పెంచడంపై సోము వీర్రాజు స్పందించారు
నగరాల అభివృద్దికి కేంద్ర ప్రభుత్వం ఏపీకి 2వేల కోట్లు ఇచ్చిందని, అయితే తీరం వెంబడి 5లక్షల కోట్లతో రోడ్లు వేసేందుకు కేంద్రం సిద్ధంగా ఉన్నా, అందుకు తగిన విధంగా రాష్ట్ర ప్రభుత్వం స్పందించడం లేదని భాజాపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు స్పష్టం చేశారు. రాష్ట్రంలో పోర్టులు కాదు గదా, కనీసం బెర్త్ లు కూడ కట్టే పరిస్ధితి లేదని ఆయన ఎద్దేవా చేశారు.
ఎన్టీఆర్ హెల్త్ వర్శిటీ పేరును వైఎస్ఆర్ హెల్త్ వర్శిటీగా పేరు మార్చడం పై భాజాపా అధ్యక్షుడు సోము వీర్రాజు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని వైద్య కళాశాలలన్నింటీని ఒకే గొడుగు కిందకు తెచ్చిన ఘనత ఎన్టీఆర్ ది అని వ్యాఖ్యానించారు.
ప్రభుత్వం వచ్చి మూడేళ్లు అవుతున్నా రాష్ట్రానికి చేసింది ఏమీ లేదని బీజేపి రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు మంత్రి అంబటి రాంబాబు నుద్దేశించి మాట్లాడారు