Last Updated:

Somu Veerraju: పోర్టులు కాదు గదా? బెర్త్ లు కూడ కట్టలేరు

నగరాల అభివృద్దికి కేంద్ర ప్రభుత్వం ఏపీకి 2వేల కోట్లు ఇచ్చిందని, అయితే తీరం వెంబడి 5లక్షల కోట్లతో రోడ్లు వేసేందుకు కేంద్రం సిద్ధంగా ఉన్నా, అందుకు తగిన విధంగా రాష్ట్ర ప్రభుత్వం స్పందించడం లేదని భాజాపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు స్పష్టం చేశారు. రాష్ట్రంలో పోర్టులు కాదు గదా, కనీసం బెర్త్ లు కూడ కట్టే పరిస్ధితి లేదని ఆయన ఎద్దేవా చేశారు.

Somu Veerraju: పోర్టులు కాదు గదా? బెర్త్ లు కూడ కట్టలేరు

Andhra Pradesh: నగరాల అభివృద్దికి కేంద్ర ప్రభుత్వం ఏపీకి 2వేల కోట్లు ఇచ్చిందని, అయితే తీరం వెంబడి 5లక్షల కోట్లతో రోడ్లు వేసేందుకు కేంద్రం సిద్ధంగా ఉన్నా, అందుకు తగిన విధంగా రాష్ట్ర ప్రభుత్వం స్పందించడం లేదని భాజాపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు స్పష్టం చేశారు. రాష్ట్రంలో పోర్టులు కాదు గదా, కనీసం బెర్త్ లు కూడ కట్టే పరిస్ధితి లేదని ఆయన ఎద్దేవా చేశారు.

నెల్లూరులో ఆయన మీడియాతో మాట్లాడుతూ కుటుంబ పార్టీలతో భాజాపా పొత్తు ఉండదని పేర్కొన్నారు. మా పొత్తు జనం, జనసేనతోనేని గట్టిగా చెప్పారు. ఏపీకి రేషన్ బియ్యం నుండి అన్నీ కేంద్రం నుండే సాయం అందుతుందన్నారు. కేంద్రం పది లక్షల ఇళ్లు కేటాయిస్తే, కట్టే పరిస్ధితి రాష్ట్ర ప్రభుత్వానికి లేదని నిలదీసారు. 14,15 ఆర్ధిక సంఘం నిధులను గ్రామాలకు కేటాయిస్తే, వాటిని ఇతర అవసరాలకు దారి మళ్లించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మద్దతు ధర ఇవ్వని ఏపీ ప్రభుత్వం, రైతులను నిలువునా మోసం చేస్తున్న దళారులను ప్రోత్సహిస్తుందని మండిపడ్డారు. వైకాపాకు ప్రజాక్షేత్రంలో తగిన శాస్తి జరగక తప్పదని హెచ్చరించారు.

నెల్లూరులో నిత్యం ప్రతిపక్షాలపై విరుచుక పడే వైకాపా నేతల్లో మంత్రి కాకాణి గోవర్ధన రెడ్డి కూడా ఒకరు. ఏపీ ప్రభుత్వ తీరును ఎండగట్టిన భాజాపా అధ్యక్షుడి మాటల పై కాకాణి ఏ విధంగా స్పందిస్తారో వేచిచూడాలి.

ఇవి కూడా చదవండి: