Home / Shiv Sena
మనీ లాండరింగ్ కేసులో మూడున్నర నెలలుగా జైలులో ఉన్న ఫైర్ బ్రాండ్, శివసేన ఉద్ధవ్ ధాకరే పార్టీ సీనియర్ నేత సంజయ్ రౌత్ కు ప్రత్యేక కోర్టు బెయిల్ మంజూరు చేసింది.
రాహుల్ గాంధీ సారథ్యంలో కాంగ్రెస్ చేపట్టిన 'భారత్ జోడో యాత్ర' మహారాష్ట్ర లోకి అడుగుపెట్టనుంది. ఈ యాత్రలో రాహుల్ తో జత కట్టేందుకు శివసేన యువనేత, మాజీ మంత్రి ఆదిత్య థాకరే సిద్ధమైనారు.
దేశంలోని 6 రాష్ట్రాల్లో 7 నియోజకవర్గాల్లో చేపట్టిన ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతుంది. మహారాష్ట్రలో అంధేరి తూర్పు అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికలో ఉద్ధవ్ ఠాక్రే పార్టీకి చెందిన శివసేన పార్టీ అభ్యర్ధిని రుతుజా లట్కే తన సమీప ప్రత్యర్ధికంటే 3812ఓట్ల ఆధిక్యంలో ఉన్నట్లు ఆరో రౌండ్ ఫలితాలతో తెలుస్తుంది.
మహారాష్ట్ర శివసేన పార్టీలో ముసలం పెట్టిన భాజపా, అసమ్మతి వర్గానికి మద్దుతు ఇచ్చి ఏక్ నాధ్ షిండేకు అధికార పీఠం కట్టబెట్టిన సంగతి అందరికి తెలిసిందే. అయితే తాజాగా ఉద్దవ్ శివసేన పార్టీకి చెందిన సామ్నా పత్రిక ఓ సంచలన రాజకీయ కధనాన్ని ప్రచురించింది.
ఉద్ధవ్ ఠాక్రే మరియు ఏక్‌నాథ్ షిండే నేతృత్వంలోని వర్గాల మధ్య ఎన్నికలగుర్తు వివాదం నేపధ్యంలో భారత ఎన్నికల సంఘం శనివారం శివసేన యొక్క విల్లు మరియు బాణం గుర్తును స్తంభింపజేసింది.
శివసేన పార్టీ గుర్తు వివాదం రోజురోజుకూ తీవ్రమవుతోంది. విల్లు-బాణం గుర్తును తమ వర్గానికే కేటాయించాలంటూ అటు ఉద్ధవ్ ఠాక్రే, ఇటు సీఎం ఏక్‌నాథ్ షిండే వర్గీయులు పోరాడుతున్నారు.