Home / security breach
తిరుమలలో మరోసారి భద్రతా వైఫల్యం బయటపడింది. అస్సాంవాసులు తిరుమలలోని మోకాళ్ళ పర్వతంపై డ్రోన్‌తో వీడియో తీశారు. మోకాళ్ళ పర్వత ప్రాంతం, ఘాట్ రోడ్డులను అస్సాం వాసులు షూట్ చేశారు.అస్సాంకు చెందిన దంపతులిద్దరూ కారులో మోకాళ్ళ పర్వతంపైకి వచ్చి డ్రోన్‌ను వినియోగించారు.
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన పార్లమెంటు పొగ కలకలం వెనుక ప్రధాన సూత్రధారి లలిత్ ఝా పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది. ఢిల్లీకి 125 కిలోమీటర్ల దూరంలో ఉన్ననీమ్రానాలో అతను చివరిసారిగా కనిపించినట్లు ఢిల్లీ పోలీసు వర్గాలు తెలిపాయి.
బుధవారం లోక్‌సభలో కలర్ స్మోక్ ప్రయోగించి పోలీసుల చేతికి చిక్కిన నిందితులను సాగర్ శర్మ , మనోరంజన్ గా గుర్తించారు. వీరిలో సాగర్ శర్మ తీసుకున్న విజిటర్ పాస్ బీజేపీ ఎంపీ ప్రతాప్ సింహా పేరుమీద జారీ అయినట్లు తెలుస్తోంది. మైసూరుకు చెందిన మనోరంజన్ వృత్తిరీత్యా ఇంజనీర్ .
ఈ ఏడాది ప్రారంభంలో ప్రధాని మోదీ పంజాబ్ పర్యటన సందర్బంగా భద్రతా ఉల్లంఘనకు ఫిరోజ్ పూర్ ఎస్ఎస్ఫీ బాధ్యత వహించాలని సుప్రీంకోర్టు పేర్కొంది. దీనిపై స్వతంత్ర విచారణ కోరుతూ "లాయర్స్ వాయిస్" అనే సంస్థ పిటిషన్ దాఖలు చేసింది.