Home / political issues
పల్నాడు జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. నరసరావుపేట నియోజకవర్గంలోని రొంపిచర్ల మండలం అలవాలలో ఈ ఘటన జరిగింది. టీడీపీ మండలాధ్యక్షుడు, మాజీ ఎంపీపీ అయిన బాలకోటిరెడ్డి ఇంట్లోకి అర్ధరాత్రి సమయంలో ప్రవేశించిన దుండగులు ఆయనపై రెండు రౌండ్ల కాల్పులు జరిపారు. తీవ్రంగా గాయపడిన బాలకోటిరెడ్డిని కుటుంబ సభ్యులు వెంటనే నర్సరావుపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.