Home / POCSO Act
లైంగిక నేరాల నుండి పిల్లలను రక్షించే పోక్సో (POCSO) చట్టం కింద లైంగిక కార్యకలాపాలకు సమ్మతి వయస్సును తగ్గించడాన్ని వ్యతిరేకిస్తూ లా కమిషన్ తన అభిప్రాయాలను తెలియజేసింది. లా కమిషన్ శుక్రవారం కేంద్ర న్యాయ మంత్రిత్వ శాఖకు సమర్పించిన నివేదికలో, సమ్మతి వయస్సును 16 ఏళ్లకు తగ్గించవద్దని సూచించింది.
చేతిలో అధికారం ఉంది.. ఏం చేసిన చెల్లుతుంది అని అనుకున్న వారికి.. ఎవరికి అయిన సరే.. తప్పు చేస్తే శిక్ష పడకుండా మానదు. మరి ముఖ్యంగా చట్టాన్ని కాపాడాల్సిన పోలీసులే బరితెగిస్తే.. అధికారం ఉంది అనే అహంకారంతో ఏం చేసిన అడిగేవాడు లేడు అనుకుంటే.. చివరికి కటకటాల్లో ఊచలు లెక్కబెట్టక తప్పదు.
బాలికలు, మహిళలపై జరుగుతున్న ఆకృత్యాలకు అంతం లేకుండా పోతుంది. వయస్సుతో కూడా సంబంధం లేకుండా వారిపై దాడులు జరుగుతూనే ఉంటున్నాయి. ప్రస్తుతం ఎవర్ని నమ్మాలో కూడా తెలియని అగమ్యగోచరమైన పరిస్థితుల్లోకి బాలికలు, యువతులు, మహిళలు వెళ్తున్నారని అనడంలో సందేహం లేదు.
పోక్సో చట్టం కింద కేసు నమోదు చేయబడిన రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (డబ్ల్యుఎఫ్ఐ) అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ సింగ్, చట్టం పెద్ద స్థాయిలో దుర్వినియోగం అవుతోంది అని ఆరోపించారు. మేము దానిని మార్చమని ప్రభుత్వం పై వత్తిడి తెస్తామని తెలిపారు