Home / Pawan Kalyan
యోగి వేమన యూనివర్శిటీలో అధికారులు యోగి వేమన విగ్రహాన్ని తొలగించి ఆ స్దానంలో వైఎస్ విగ్రహాన్ని ఏర్పాటు చేసారు. అధికారుల అత్యత్సాహం పై పలువురు మండిపడుతున్నారు. దీనిపై జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ట్విట్టర్ వేదికగా విమర్శలు గుప్పించారు.
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై వైసీపీ సర్కార్ పరోక్షంగా కక్ష సాధింపులకు దిగుతోంది. ఇటీవల రోడ్డు విస్తరణ కోసం ఇప్పటంలో ఇళ్ల కూల్చివేత వివాదాస్పదంగా మారడం. బాధితులకు పవన్ అండగా నిలిచి లక్ష రూపాయల చొప్పున ఆర్థిక సాయం ప్రకటించిన విషయం తెలిసిందే.
జనసేన అధినేత పవన్ కల్యాణ్ ట్విట్టర్లో ఓ వీడియో పోస్టు చేశారు. ఫ్యూడలిస్టిక్ కోటల్ని బద్దలు కొట్టక తప్పదు అంటూ సాగిన ఈ వీడియోలో పవన్ ఇలా అన్నారు.
జనసేన పార్టీ ఆవిర్భావ సభకు సహకరించారన్న కారణంగా ఇప్పటం గ్రామం పై వైకాపా ప్రభుత్వం కక్షకట్టిన సంగతి విధితమే. ఈ క్రమంలోనే గ్రామంలో రోడ్డు వెడల్పు సాకుతో సుమారుగా 53 ఇండ్లను పూర్తిగా, పాక్షికంగా నేలమట్టం చేశారు.
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విశాఖ పర్యటన సందర్భంగా విశాఖ ఎయిర్ పోర్ట్లో చోటు చేసుకున్న ఉద్రిక్త సంఘటనల నేపధ్యంలో లో ఏసీపీ మోహన్రావు పై సస్పెన్షన్ వేటు పడింది.
ఏపీ ప్రభుత్వానికి పవన్ మాస్ వార్నింగ్
మూడున్నర సంవత్సరాల్లో వైసీపీ ప్రభుత్వం చేసిన అభివృద్ధి పై చర్చించడానికి తాము సిద్ధంగా ఉన్నామని చర్చకు మీరు సిద్ధమా అంటూ మంత్రి రోజా ప్రతిపక్షాలకు సవాల్ విసిరారు.
పవన్ కళ్యాణ్ గుంటూరు జిల్లా తాడేపల్లి పరిధిలోని ఇప్పటం గ్రామంలోని బాధితుల పరామర్శకు వెళ్లారు. ఈ క్రమంలో ఆయన వాహనాలను పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. దానితో వాహనం దిగి ఆయన మూడు కిలోమీటర్ల మేర పాదయాత్రగా వెళ్లారు. "వైసీపీ గూండాల అరాచకాలు ఇలాగే సాగితో ఇడుపులపాయలో మీ ఇళ్ల మీద నుంచి హైవే వేస్తాం" అని పవన్ హెచ్చరించారు.
నేడు జనసేనాని ఇప్పటం గ్రామంలో పర్యటించనున్నారు. అయితే ఈ సందర్భంగా పవన్ ను అరెస్ట్ చేస్తారనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి.
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇంటి వద్ద రెక్కీ పై మాజీ మంత్రి కోడలి నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో వచ్చే ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ 45 సీట్లు అడుగుతున్నాడు కాబట్టి చంద్రబాబే అతన్ని చంపాలని చూస్తాడంటూ కొడాలి ఆరోపించారు.